Breaking News

సినిమాలకు రిటైర్‌మెంట్‌.. క్లారిటీ ఇచ్చిన సబర్మతి రిపోర్ట్ నటుడు!

Published on Tue, 12/03/2024 - 18:20

12th ఫెయిల్ మూవీతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. ఇటీవల సబర్మతి రిపోర్ట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతోంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా విక్రాంత్ మాస్సే చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాను 2025వరకు మాత్రమే సినిమాలు చేస్తానని పోస్ట్ చేశారు. తన ఫ్యామిలీ కోసం సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఆయన నిర్ణయంపై ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

అయితే తాజాగా తన పోస్ట్‌పై విక్రాంత్ మాస్సే క్లారిటీ ఇచ్చాడు. అది తన రిటైర్మెంట్ ప్రకటన కాదని మరో పోస్ట్ చేశాడు. తన కుటుంబం, ఆరోగ్యం కోసమే కొద్ది రోజుల పాటు విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తన పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. సరైన సమయం వచ్చినప్పుడు రీ ఎంట్రీ ఇస్తానని అభిమానులకు భరోసా ఇచ్చాడు.ఈ ప్రకటనతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

విక్రాంత్ మాస్సే తన స్టేట్‌మెంట్‌లో రాస్తూ..  "నాకు నటించడం మాత్రమే తెలుసు. నటన నాకు అన్నీ ఇచ్చింది. ప్రస్తుతం నా శారీరక, మానసికంగా అలసిపోయా. నేను కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. సరైన సమయంలో మళ్లీ సినిమాల్లోకి వస్తా. నా కుటుంబం, ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి కొంత సమయం విరామం ప్రకటిస్తున్నా' అని ప్రకటన విడుదల చేశారు.

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)