Breaking News

తండ్రిగా ప్రమోషన్‌ పొందిన టాలీవుడ్‌ హీరో

Published on Thu, 09/04/2025 - 10:56

నటుడు అదిత్‌ అరుణ్‌ (త్రిగుణ్‌) తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. తన భార్య సీమంతం వీడియోను తాజాగా పంచుకున్నాడు. చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకున్నా సరే టాలెంట్ను నమ్ముకుని వచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్‌.. మొదట కథ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అలాగే ఆర్జీవి తెరకెక్కించిన కొండా చిత్రంతో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులందరికి చాలా దగ్గరయ్యారు. రీసెంట్గా లైన్మ్యాన్‌, ఉద్వేగం వంటి చిత్రాలతో మెప్పించారు.

త్రిగుణ్‌ 2023 సెప్టెంబర్లో నివేదిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు తిరుపురులో జరిగిన వారి పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు దంపతులు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. దీనికంటే ముందు నివేదిత సీమంతం కూడా ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆయన పంచుకున్నారు.

చెన్నైలో పుట్టి పెరిగిన త్రిగుణ్ కథ అనే చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టారు. ఆ తర్వాత త్రిగుణ్ పలు సినిమాల్లో నటించారు. వైవిధ్యభరితమైన కథలతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘కొండా’ చిత్రంతో ఫేమస్ అయ్యాడు. పీవీఎస్ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డియర్ మేఘ, చీకటి గదిలో చితక్కొట్టుడు, ప్రేమదేశం, కథ కంచికి.. మనం ఇంటికి, తుంగభద్ర, 24 కిస్సెస్, కిరాయి, లైన్‌మెన్‌ లాంటి చిత్రాల్లో నటించారు. త్రిగుణ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)