Breaking News

హీరో విజయ్‌ సీఎం అవుతాడు: సుమన్‌

Published on Sun, 01/04/2026 - 16:18

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనబోతున్నాడు. ఈ ఏడాది జరగబోయే ఎలక్షన్స్‌లో తను స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' తరపున పోటీ చేయనున్నాడు. అయితే ఈసారి విజయ్‌ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నాడు సీనియర్‌ నటుడు సుమన్‌.

జనాల్లో అనుమానాలు
తాజాగా సుమన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనాలు సెలబ్రిటీలను చాలారకాలుగా పరిశీలిస్తారు. ఈ హీరో నిజంగానే పొడుగ్గా ఉన్నాడా? ఎర్రగా ఉన్నాడా? ఆయన జుట్టు ఒరిజినలేనా? గొంతు తనదేనా? ఇలాంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి హీరో సభకు వస్తుంటారు. మొదటిసారి వచ్చినంతమంది జనాలు రెండోసారి రారు. అయినా రెండోసారి, మూడోసారి కూడా పెద్ద మొత్తంలో జనాలు వస్తున్నారంటే అది భయంకరమైన ఫాలోయింగ్‌ అని అర్థం.

సినిమా వదిలేయాల్సిందే!
ఏదేమైనా ఆయన అదృష్టం, జాతకాన్ని బట్టి రాజకీయాల్లో ఫలితం ఉంటుంది. సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చి గెల్చారంటే మాత్రం మూవీస్‌ వదిలేయాల్సిందే! ఎందుకంటే ప్రజలు ఆయనపై నమ్మకం పెట్టి గెలిపించారంటే ఎక్కడా ఏ తప్పూ జరగకుండా చూసుకోవాలి! సినిమా షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఎక్కడైనా తప్పు జరిగిందనుకోండి.. ఆ నింద హీరోపైనే వేస్తారు.

రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేం
అందుకే గెలిచేవరకు ఆగండి. గెలిచిన తర్వాత మాత్రం తప్పనిసరిగా సినీ జీవితాన్ని పక్కనపెట్టండి. సినిమాల్లోకి ఎప్పుడైనా రావొచ్చు.. కానీ రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేం.. ప్రజలకు సేవ చేయడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం.. ఇలా ఏమేం చేయాలో అన్నీ చేయండి.. ఆల్‌రెడీ సగంలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ప్రజాసేవకు అంకితం కండి. ప్రజలకు అనేక సమస్యలున్నాయి. 

విజయ్‌కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌
మీరు షూటింగ్‌కు వెళ్తే ఏమంటారంటే.. ఆయన షూటింగ్‌కు వెళ్లకుంటే ఈ పని పూర్తి చేయొచ్చు అని పెదవి విరుస్తారు. ఎన్టీఆర్‌ కూడా రాజకీయాల్లోకి వచ్చాక ఆల్‌రెడీ ఒప్పుకున్న సినిమాను పూర్తి చేశారు తప్ప మళ్లీ సినిమాల్లోకి వెళ్లలేదు. విజయ్‌కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఓటు వేయడానికి ఒకటీరెండు రోజుల ముందు ఏదైనా ఒక సంఘటన జరిగితే అంతా మారిపోతుంది. లేదు, ఆయనకు అదృష్టం ఉంటే కచ్చితంగా విజయ్‌ సీఎం అవుతాడు అని సుమన్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్‌.. గూండా అని పేరెంట్స్‌ తిట్టారు

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)