ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?
Breaking News
'అతని టాలెంట్‌ను వాడుకోండి'.. ఐ బొమ్మ రవిపై టాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్
Published on Mon, 11/17/2025 - 15:08
ఇప్పుడు ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. అతనే ఇన్ని రోజులు సినీ ఇండస్ట్రీకి కోట్ల రూపాయలు నష్టం కలిగించిన వ్యక్తి. ఇటీవలే విదేశాల నుంచి ఇండియాకు వస్తూ పోలీసులకు దొరికిపోయాడు. అతను ఐ బొమ్మ ఇమ్మడి రవి. తెలుగు సినీ ఇండస్ట్రీ ఆదాయానికి కొన్నేళ్లుగా గండి కొడుతూ విదేశాల్లో తప్పించుకు తిరుగుతున్నారు. కానీ చివరికీ పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయాడు. సవాల్ విసిరిన రవి.. చాలా ఈజీగానే దొరికేశాడు.
అతని గురించి అంతా నెగెటివ్ జరుగుతున్న వేళ.. టాలీవుడ్ నటుడు శివాజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐ బొమ్మ రవి టాలెంటెడ్‌గా కనిపిస్తున్నారు. అతని హ్యాకింగ్ తెలివిని దేశ భద్రతకు పనికొచ్చేలా ఉపయోగించుకోవాలని సూచించారు. వాడిలో ఉన్న కసిని మంచి పనికి వినియోగించి ఉంటే బాగుండేదని అన్నారు. అతను చేసింది చాలా దుర్మార్గమైన పనే.. కానీ అతని టాలెంట్ మనదేశ భద్రత కోసం ఉపయోగించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయమని తెలిపారు. చాలా మందిని ఇబ్బందిపెట్టిన రవి.. ఇకనుంచైనా మారాలని కోరుకుంటున్నాని శివాజీ వెల్లడించారు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా చీప్‌గా దొరికేది ఒక్క సినిమా మాత్రమేనన్నారు. ఏదైనా సినిమా బాగుంటే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని శివాజీ వెల్లడించారు. ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన ఐ బొమ్మ రివి గురించి మాట్లాడారు.
ఆ అబ్బాయి టాలెంటెడ్ అని విన్నాను.. అతని హ్యాకింగ్ టాలెంట్ దేశానికి ఉపయోగపడితే బాగుంటుంది.
Actor Shivaji about #IBommaRavi pic.twitter.com/ue2LNMjwNf— Rajesh Manne (@rajeshmanne1) November 17, 2025
Tags : 1