Breaking News

ఆట మళ్లీ ఆరంభం

Published on Sat, 03/01/2025 - 00:51

రామ్‌చరణ్‌(Ram Charan) హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీలో జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్, వృద్ధి సినిమాస్‌ పతాకాలపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విభిన్న రకాల స్పోర్ట్స్‌ (క్రికెట్, కుస్తి..) ప్రస్తావన ఉంటుందని తెలిసింది.

ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఆ తర్వాత రామ్‌చరణ్‌ అండ్‌ కో షూటింగ్‌ నుంచి చిన్న బ్రేక్‌ తీసుకున్నారు. ఈ బ్రేక్‌లో తన నెక్ట్స్‌ మూవీ స్క్రిప్ట్‌ విషయాలను చర్చించేందుకు దర్శకుడు సుకుమార్‌తో కలిసి రామ్‌చరణ్‌ దుబాయ్‌ వెళ్లారని తెలిసింది. కాగా ‘పెద్ది’ సినిమా షూటింగ్‌ను తిరిగి ఈ వారంలో ప్రారంభించాలని చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణలో రామ్‌చరణ్‌తో పాటుగా కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ కూడా పాల్గొంటారు.

జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్  సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ నెల 27న రామ్‌చరణ్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ విడుదలయ్యే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ‘పెద్ది’ సినిమాని ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు మేకర్స్‌.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)