జమ్మూకశ్మీర్ : దోడా జిల్లాలో ఘోర ప్రమాదం
Breaking News
నన్ను వాడుకుని వదిలేశారు.. ఒక్కడూ..!: శర్వానంద్
Published on Thu, 01/22/2026 - 14:13
మొత్తానికి టాలీవుడ్ హీరో శర్వానంద్ హిట్టు కొట్టాడు. నారీ నారీ నడుమ మురారి మూవీతో సంక్రాంతి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు.
నిర్మాతతో విభేదాలు?
ఇకపోతే శర్వానంద్‌కు, నిర్మాత అనిల్ సుంకర మధ్య విభేదాలంటూ గతంలో కొన్ని రూమర్స్ వచ్చాయి. సినిమా రిలీజ్ సమయంలో శర్వా.. అనిల్ సుంకరను ప్రశంసించిన విధానం చూస్తే అవన్నీ ఉట్టి రూమర్సే అని తేలిపోయాయి. అయినప్పటికీ తాజాగా ఓ చిట్‌చాట్‌లో నిర్మాతతో విభేదాలపై స్పందించాడు.
నా పరిస్థితి ఇలా..
శర్వానంద్ మాట్లాడుతూ.. అనిల్‌గారు, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మాకే తెలుసు. మేమంతా ఒకరకమైన బాధలో ఉన్నాం. ఇప్పుడు చెప్పొచ్చో లేదో నాకు తెలీదు కానీ నాకు హిట్టొచ్చి ఆరేడేళ్లవుతోంది. నా పరిస్థితి ఇలా ఉంటే అనిల్ నిర్మాతగా చేసిన గత రెండు సినిమాలు పోయాయి. అలా ఒకరికొకొకరం సహాయం చేసుకునే పరిస్థితి కూడా లేదు.
మోసం చేశారు
గతంలో నేను చాలామంది నిర్మాతలకు సాయం చేశాను. అందరూ వాడుకుని వదిలేసినవాళ్లే! నేను సాయం చేసినప్పుడు శర్వా మనవాడు అన్న భావన వారిలో ఉండాలి కదా.. అది ఏమాత్రం లేదు. నన్ను మోసం చేశారు. అలాంటి వాళ్లను నమ్మాలంటే కూడా ఆలోచించాల్సి వస్తోంది. అలా వారి వల్ల నాకు తెలియకుండానే తిక్కలోడిగా మారిపోయాను. కానీ, అనిల్‌గారు నన్ను నమ్మి ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆయన నాకు అన్నకంటే ఎక్కువ అని చెప్పుకొచ్చాడు. శర్వానంద్ ప్రస్తుతం బైకర్, భోగి సినిమాలు చేస్తున్నాడు.
చదవదండి: నటుడు, ఎమ్మెల్యే రెండో పెళ్లి.. మొదటి భార్య సంచలన ఆరోపణలు
Tags : 1