Breaking News

మహేశ్- రాజమౌళి సినిమాలో కట్టప్ప.. స్పందించిన నటుడు!

Published on Thu, 05/30/2024 - 18:36

తమిళ నటుడు తెలుగువారికి సైతం సత్యరాజ్‌ పరిచయం అక్కర్లేని పేరు. బాహుబలిలో కట్టప్పగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తాజాగా వెపన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటిస్తారన్న వార్తలపై ఆయన మరోసారి స్పందించారు. నాపై వస్తున్నవన్నీ రూమర్స్‌ మాత్రమేనని కొట్టిపారేశారు. ప్రధాని మోదీ బయోపిక్‌లో తాను నటించడం లేదని మరోసారి ఫుల్ ‍క్లారిటీ ఇచ్చేశారు.  భవిష్యత్‌లో మోదీ బయోపిక్‌ కోసం ఎవరైనా నన్ను సంప్రదించినా చేయనని తేల్చిచెప్పారు.

డైరెక్టర్‌ రాజమౌళికి తాను ఎప్పుడు రుణపడి ఉంటానని సత్యరాజ్ అన్నారు. ఆయన వల్లే ఇండియా వైడ్‌గా కట్టప్పగా ఫేమస్ అయ్యానని తెలిపారు. నా డార్లింగ్ ప్రభాస్ సినిమా కల్కి రిలీజ్  కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. మహేశ్‌, రాజమౌళి సినిమాలో తాను నటించడం లేదని వెల్లడించారు. ఒకవేళ నటించే అవకాశం వస్తే.. ఛాన్స్‌ వదులుకోనని సత్యరాజ్ అన్నారు. కాగా.. గతంలో మోదీ జీవితంపై ఓ సినిమాను తెరకెక్కించారు. 'పీఎం నరేంద్ర మోదీ'పేరుతో 2019లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్‌లో ఈ సినిమాను ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.
 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)