Breaking News

చెన్నైలో శరత్‌బాబు అంత్యక్రియలు..పిల్లలు లేకపోవడంతో..

Published on Tue, 05/23/2023 - 10:21

సీనియర్‌ నటుడు శరత్‌బాబు మరణం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. రామరాజ్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శరత్‌బాబు తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో సుమారు 300కి పైగా సినిమాల్లో నటించారు.చదవండి: చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూసిన శరత్‌బాబు

నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సత్తా చాటిన ఆయన చివరగా నరేష్‌-పవిత్రా లోకేష్‌ల మళ్లీ పెళ్లి సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అనరోగ్యంతో ఇటీవలే బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీలో చేరిన శరత్‌బాబు మల్టీఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. 

నేడు అంత్యక్రియలు
శరత్‌బాబు తోడబుట్టినవాళ్లల్లో అన్నయ్య ఉమా దీక్షితులు, తమ్ముళ్లు గోపాల్, గోవింద్, సంతోష్, మధు, మంజు ఉన్నారు. శరత్‌బాబు రెండో అన్నయ్య రమా దీక్షితులు మూడేళ్ల కిందట మృతి చెందారు. అక్కచెల్లెళ్లు సిరి, రాణి, బేబీ, మున్ని, రోజా ఉన్నారు.

శరత్‌బాబు మృతికి రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, బాలకృష్ణ తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా సోమవారం సాయంత్రం 2 గంటల పాటు హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం శరత్‌బాబు భౌతికకాయాన్ని ఉంచి, ఆ తర్వాత చెన్నై తరలించారు. చెన్నైలో నేడు శరత్‌బాబు అంత్యక్రియలు జరుగుతాయి.అయితే ఆయనకు పిల్లలు లేకపోవడంతో తలకొరివి ఎవరు పెడతారన్నది సందేహంగా మారింది.చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్‌' నటుడు స్టీవెన్‌ సన్‌ మృతికి కారణమిదే!

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)