ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు
Breaking News
స్టార్ కమెడియన్ కొత్త సినిమా.. విచిత్రమైన టైటిల్
Published on Fri, 10/20/2023 - 16:50
'డీడీ రిటర్న్స్' సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన కమెడియన్ కమ్ హీరో సంతానం.. ఆ తర్వాత 'కిక్' చిత్రంతో ఫెయిలయ్యాడు. అయితేనేం హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అతడు చేస్తున్న సినిమాల్లో 'బిల్డప్' ఒకటి. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ దర్శకుడు. రాధిక ప్రీతి హీరోయిన్. దర్శకుడు కేఎస్ రవికుమార్, ఆనంద్‌రాజ్, మన్సూర్ అలీ ఖాన్, మొట్టై రాజేంద్రన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
(ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు)
ఇది కామెడీ ఫాంటసీ విలేజ్ సినిమా అని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. 1980 టైంలో జరిగే సినిమా ఇదని చెప్పాడు. ఈ క్రమంలోనే షూటింగ్ లోకేషన్స్, కాస్ట్యూమ్స్ కోసం చాలా కష్టపడినట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు. మరో విషయం ఏంటంటే.. మనోబాల, మైల్‌సామి నటించిన చివరి చిత్రం ఇదేనని అన్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తామని క్లారిటీ ఇచ్చాడు.
(ఇదీ చదవండి: మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి)
Tags : 1