Breaking News

ఏంటి ఇప్పుడు నీ కాళ్లు పట్టుకోవాలా అని తారక్ నాతో..

Published on Mon, 02/16/2026 - 16:15

రీసెంట్‌గా వచ్చిన 'శంబాల' సినిమాలో విలన్‌గా చేసిన రవివర్మ మంచి పేరు తెచ్చుకున్నాడు. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ అడపాదడపా మాత్రమే మూవీస్ చేస్తూ వస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం వచ్చిన 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ మూడో సీజన్‪‌లోనూ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ క్రమంలోనే తాజాగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ఒకదానిలో ఎన్టీఆర్‌తో తనకున్న జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. ఎంతలా తనని ర్యాగింగ్ చేశాడో చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)

'రాఖీ సినిమాని కేవలం ఎన్టీఆర్, కృష్ణవంశీని చూసే చేశారు. స్టోరీ కూడా నాకు సరిగా తెలియదు. వాళ్లు చెప్పింది చేసేశాను. నేను మొదట నటించిన 'వెన్నెల' మూవీ ప్రివ్యూ చేసిన కృష్ణవంశీ.. బాగా చేశావ్ ఇదెన్నో సినిమా అని అన్నారు. ఇదే తొలి చిత్రమని చెబితే ఆశ్చర్యపోయారు. సరే కలిసి పనిచేద్దాం అని అన్నారు. అలా పిలిచి 'రాఖీ'లో అవకాశమిచ్చారు. అందులో మెయిన్ విలన్ నేను అన్నట్లు చూపించారు గానీ నేనైతే అలా అనుకోలేదు. ఆ మూవీ చూపించిన ప్రభావం నుంచి బయటకు రావడానికి చాలా ఏళ్లు పట్టేసింది. నా ఫ్రెండ్స్ కూడా కొందరు.. మా చెల్లికి ఇలాంటి భర్త వస్తే ఏంటి పరిస్థితి అని భయపడ్డారు'

'రాఖీ సినిమాలో ఎన్టీఆర్.. నా కాళ్లు పట్టుకునే సీన్ ఒకటి ఉంది. అయితే నా దగ్గరకొచ్చి.. ఏంటి ఇప్పుడు నేను నీ కాళ్లు పట్టుకోవాలి అని ర్యాగింగ్ చేశాడు. గురువు గారు, నాకు తెలీదు, డైరెక్టర్-మీరు చూసుకోండి అని దండం పెట్టేశా. ఆ రోజంతా కూడా.. నీ పని చెప్తా అని నన్ను ఆటపట్టించారు. ఓ రేంజులో ఆడుకున్నారు. అలానే నా పుట్టినరోజు నాడు నేను చనిపోయే షూటింగ్ జరిగింది. దానిపై కూడా తారక్ కౌంటర్స్ వేస్తూనే ఉన్నారు. అలానే పెద్ద కేక్ కూడా సెట్‌కి తెప్పించి సెలబ్రేట్ చేశారు. తారక్,కృష్ణవంశీ ఇద్దరూ కలిసి నా ముఖమంతా కేక్ పుసేశారు' అని రవివర్మ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: బీజేపీ నేత దారుణ కామెంట్స్‌పై స్పందించిన త్రిష)

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?