Breaking News

ఇలాగైతే విజయ్‌ గెలవడు.. అలా చేయాల్సిందే!: నటుడు

Published on Thu, 02/08/2024 - 12:01

దళపతి విజయ్‌ 'తమిళగ వెట్రి కళగం' పేరుతో  పార్టీని ప్రారంభించడంతో తమిళనాట పాలిటిక్స్‌ మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే విజయ్‌ సొంతంగా మాట్లాడకుండా తన తరఫున బుస్సీ ఆనంద్‌ మీడియా ద్వారా ప్రకటనలు చేస్తే గెలవరని నటుడు, నిర్మాత కె.రాజన్‌ అన్నారు. ఆయన ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఎంజీఆర్‌ ప్రజలకు చేసిన సేవల్లో 30 శాతం చేస్తే విజయ్‌ రాజకీయాల్లో రాణిస్తారన్నారు. ఆయన ప్రజలకు మంచి చేస్తారని భావిస్తున్నానన్నారు. నినైవెల్లా నీయడా చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై కె.రాజన్‌ పై వ్యాఖ్యలు చేశారు.

ఇళయరాజా సంగీతం..
లేఖా క్రియేటర్స్‌ పతాకంపై రాయల్‌ ప్రభు నిర్మించిన చిత్రం నినైవెల్లా నీయడా. సెటిలైంది, రణతంత్ర, ఆరువా సౌండ్‌ వంటి హిట్‌ సినిమాల ఫేమ్‌ ఆదిరాజన్‌ ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు రాసి దర్శకత్వం వహించారు. ప్రాజన్‌, మనీషాయాదవ్‌ జంటగా నటించగా రాజా భట్టార్జి చాయాగ్రహణం, ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఇది ఇళయరాజా సంగీతం అందించిన 1,417వ చిత్రం కావడం విశేషం. చిత్ర ఆడియో లాంచ్‌ మంగళవారం సాయంత్రం నిర్వహించారు.

ఆయన్ను కలవడమే కష్టమన్నారు..
ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత కె.రాజన్‌, దర్శకుడు పేరరసు, ఆర్వీ ఉదయకుమార్‌, నిర్మాత కేఆర్‌ సినీ ప్రముఖులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు ఆదిరాజన్‌ మాట్లాడుతూ.. ఇది మధురైలో తన మిత్రుడి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ప్రేమ కథా చిత్రం అని చెప్పారు. ఇందులో 70 శాతం వాస్తవం కాగా 30 శాతం కల్పితమని పేర్కొన్నారు. ఇళయరాజాను చేరడమే కష్టమని కొందరు చెప్పారని, అలాంటిది ఈ చిత్రానికి ఆయన సంగీతాన్ని అందించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇళయరాజాతో పనిచేయడం మంచి అనుభవంగా పేర్కొన్నారు.

చదవండి: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్‌ నటి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)