Breaking News

మూడేళ్లు డేటింగ్.. ప్రియుడిని పెళ్లాడిన రానా నాయుడు హీరోయిన్

Published on Mon, 02/17/2025 - 18:21

ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్‌.. తన చిన్ననాటి స్నేహితురాలు, రానా నాయుడు వెబ్ సిరీస్‌ నటి ప్రియా బెనర్జీని ఆయన పెళ్లాడారు. ముంబయిలోని బాంద్రాలో జరిగిన వీరి పెళ్లి వేడుకలో సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.  దివంగత నటి స్మితా పాటిల్‌ కుమారుడే ప్రతీక్ బాబర్. తాజాగా తన వివాహానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు ప్రతీక్. ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఫిబ్రవరి 14న శుక్రవారం జరిగింది.  ఫిబ్రవరి 12న మొదలైన హల్దీ, మెహందీ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగాయి.

దాదాపు మూడు సంవత్సరాల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ నవంబర్ 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రియా పుట్టినరోజున నవంబర్ 28న ఓ రెస్టారెంట్‌లో ప్రపోజ్ చేసినట్లు ప్రతీక్ వెల్లడించాడు. ఆ తర్వాత వీరు తమ రిలేషన్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. అయితే పలు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ తరహా పాత్రలు చేస్తున్న ప్రతీక్ బాబర్.. గతంలో హీరోయిన్ అమీ జాకన్స్‌తో డేటింగ్ చేసినట్లు టాక్. 2019లో సన్యా సాగర్ అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ  తర్వాత మనస్పర్థలు రావడంతో  విడిపోయారు.

'రానా నాయుడు' వెబ్ సిరీస్‌లో మెప్పించిన ప్రియా బెనర్జీ. ఈ సిరీస్‌లో రానాని టెంప్ట్ చేసే అమ్మాయి పాత్రలో నటించింది. కానీ అంతకు ముందే కిస్, జోరు, అసుర తదితర సినిమాలు చేసిన ప్రియా బెనర్జీకి తెలుగులో పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. ప్రస్తుతం ఓటీటీల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. తాజాగా నటుడు ప్రతీక్ బాబర్‌ను పెళ్లాడింది. ప్రతీక్ బాబర్ హిందీలో జానే తు యా జానేనా, దమ్‌ మారో దమ్‌, ఏక్‌ దీవానా తా వంటి పలు సినిమాల్లో నటించాడు.
 

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)