Breaking News

'వారణాసి'లో ప్రకాష్ రాజ్ పాత్ర పవర్‌ఫుల్‌.. రివీల్‌ చేసిన నటుడు

Published on Tue, 02/17/2026 - 09:00

మహేశ్‌బాబు- రాజమౌళి కాంబినేషన్‌ సినిమా ‘వారణాసి’.. ఇందులో  ప్రకాష్ రాజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఏ పాత్రలో కనిపిస్తారనేది దర్శకుడు ప్రకటించలేదు. దీంతో సోషల్‌మీడియాలో పలు కథనాలు వచ్చాయి. మహేశ్‌ బాబుకు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని రూమర్స్‌ వచ్చాయి. ఈ విషయంపై ఆయనే క్లారిటీ ఇచ్చారు. వారణాసిలో శివుడి పరమ భక్తుడిగా నటిస్తున్నానని తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్‌ పంచుకున్నారు. ఆపై  హిందీ ‘దృశ్యం 3’లోనూ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.

రాజమౌళి దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ఇప్పటికే విక్రమార్కుడులో నటించిన విషయం తెలిసిందే. ఆపై మహేశ్‌తో కూడా ఆయన కలిసి పలు సినిమాల్లో నటించారు. ఒక్కడు, రాజకుమారుడు, గుంటూరు కారం వంటి పలు సినిమాల్లో మెప్పించారు. ఇప్పుడు వారణాసిలో వీరిద్దరూ మరోసారి కలిశారు. మైథలాజికల్‌ మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న  ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

వారణాసి సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ జార్జియాలో మొదలు కానుందని సమాచారం. అక్కడ షూటింగ్‌ చేసేందుకు సంబంధించిన కార్యాచరణను ఆల్రెడీ ప్రారంభించారట రాజమౌళి. అలాగే ఓ కీలక షెడ్యూల్‌ను అంటార్టికాలోనూ ప్లాన్‌ చేశారని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. ఒకవేళ అంటార్టికా లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిగితే, అక్కడి క్లిష్టమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకునే తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ సినిమా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్‌ 7న రిలీజ్‌ కానుంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)