Breaking News

నా తండ్రి ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నారు: ప్రదీప్‌ రంగనాథ్‌

Published on Sun, 10/12/2025 - 08:29

ప్రదీప్‌ రంగనాథన్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ సినిమా ‘డ్యూడ్‌’. కీర్తీశ్వరన్‌ దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబరు 17న ఈ చిత్రం విడుదల కానుంది. కొద్దిరోజులుగా ప్రదీప్‌ రంగనాథన్ పేరు టాలీవుడ్‌లో వైరల్‌ అవుతుంది. ఆయన తండ్రి చేస్తున్న పని గురించి కొందరు చర్చించుకుంటే.. మరికొందరు మాత్రం అతనిపై ఒక జర్నలిస్ట్‌ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటున్నారు. 'మీరు హీరో మెటీరియల్‌లా లేరు.. కానీ, రెండు సినిమాలకే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా అరుదు' అంటూ ఒక జర్నలిస్ట్‌ కామెంట్‌ చేశారు. దీంతో నెటిజన్లు కూడా ప్రదీప్‌కు మద్ధతుగా నిలిచారు. జర్నలిస్ట్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు. రీసెంట్‌గా కిరణ్‌ అబ్బవరం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి అంటూ సదరు జర్నలిస్ట్‌ను కోరారు.

వెండితెరపై ప్రదీప్‌ రంగనాథ్‌ ఒక సాధారణ యువకుడిలా కనిపించడమే కాదు నిజ జీవితంలో కూడా అంతేనని చెప్పవచ్చు. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండానే సినీ పరిశ్రమలోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల పాటు సరైన ఛాన్స్‌ కోసం ఆయన కష్టపడ్డారు. ఫైనల్‌గా విజయం సాధించారు. డబ్బు, పేరు అన్నీ ప్రదీప్‌కు వచ్చాయి. కానీ, ఇప్పటికీ ఆయన కుటుంబం సాధారణ జీవితమే గడుపుతుంది. ఇదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రదీప్‌ పంచుకున్నారు.

నా తండ్రి  చెన్నైలో  సాధారణ జీవితమే గడుపుతున్నారు. ఒక జిరాక్స్‌ షాపు నడుపుతూనే మా కుటుంబాన్ని నాన్న పోషించారు. నాకు సినిమా ఛాన్సులతో పాటు పేరు, డబ్బు వచ్చింది. అయినప్పటికీ నాన్న మాత్రం జిరాక్స్‌ షాప్‌ నడుపుతూనే ఉన్నారు. ఎప్పటికీ  మన మూలాలను మరిచిపోవద్దని ఆయన చెబుతుంటారు. రోజూ ఉదయాన్నే బస్సులోనే షాప్‌కు వెళ్తారు.. ఒక  కారు కొనిస్తానని చెప్పినా సరే దానిని తిరస్కరించారు. ఇప్పటికీ బస్సులోనే ఆయన ప్రయాణం చేస్తారు. సింపుల్‌గా ఉండటమే నాన్నకు ఇష్టం.' అని ప్రదీప్‌ చెప్పారు.

ప్రదీప్‌ రంగనాథ్‌ తన కాలేజీ రోజుల గురించి కూడా గుర్తు చేసుకున్నారు. ఇంటర్మీడియట్‌లో 98 శాతం మార్కులతో పాస్‌ అయ్యానని చెప్పారు. కానీ, తనకు ఎక్కువ సినిమాలంటే పిచ్చి అని కూడా తెలిపారు. దీంతో తన తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందే వారని గుర్తుచేసుకున్నారు. అయితే, చదువును అశ్రద్ధ చేయనని వారికి చెప్పాను. జయం రవితో కొమలి సినిమాను డైరెక్ట్‌ చేసిన తర్వాత పరిశ్రమలో  ఫేమ్‌ దక్కిందన్నారు. ఆ తర్వాత లవ్‌ టుడేతో మరింత గుర్తింపు వచ్చిందన్నారు. ప్రదీప్‌ డైరెక్ట్‌ చేసిన ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)