Breaking News

హీరో అవ్వాల్సిన ఆ స్టార్ కొడుకు.. 9 ఏళ్లుగా మంచానికే పరిమితమై!

Published on Wed, 09/27/2023 - 21:14

తెలుగు ఇండస్ట్రీలో అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారు. అయితే అందరూ తెలుగువాళ్లేనా అంటే కాదు. పరభాషల నుంచి ఇక్కడికొచ్చి ఇక్కడివాళ్ల కంటే బోలెడంత క్రేజ్ సంపాదించిన నటులు చాలా అంటే చాలామంది. వాళ్లలో నాజర్ ఎప్పుడూ టాప్‌లో ఉంటాడు. పుట్టిపెరిగింది తమిళనాడులో అయినా దాదాపు ఆరు భాషల్లో కలిపి 600 వరకు సినిమాల్లో నటించారు. తెరపై అంరినీ అలరిస్తున్న ఈయన.. కొడుకు విషయంలో తీరని కష్టాన్ని దిగమింగుతున్నాడని మీలో ఎవరికైనా తెలుసా?

1985లో నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన నాజర్.. ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించారు. ప్రాంతీయ భాషా చిత్రాల నుంచి పాన్ ఇండియా సినిమాల వరకు ఈయన ఉండాల్సిందే. సినిమాల పరంగా ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరించిన ఈయన.. తన వారసుల్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. రెండో కొడుకు ప్రస్తుతం నటుడిగా ఉన్నప్పటికీ.. పెద్ద కొడుకు విషయం మాత్రం ఈయన్ని ఎప్పుడూ కృంగదీస్తూనే ఉంటుంది.

(ఇదీ చదవండి: హీరోయిన్ కంగనకు పెళ్లి? టైమ్ కూడా ఫిక్స్!)

నాజర్‌కి ముగ్గురు కొడుకులు. అందులో పెద్దోడి పేరు అబ్దుల్ ఫైజల్ హాసన్. తండ్రిలానే నటుడు కావాలనుకున్నాడు. నాజర్‌కు ఈ విషయం తెలిసి, హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసి సన్నాహాలు చేశాడు. అంతలోనే పెద్ద కుదుపు. నాజర్ పెద్ద కొడుకు ప్రయాణిస్తున్న కారు ఘోరమైన ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో  బయటపడ్డాడు కానీ పూర్తిగా వీల్ ఛైర్ లేదా మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అలా మరికొన్ని రోజుల్లో హీరో అవుతాడనుకున్న పెద్ద కొడుకు.. జీవచ్ఛవంలా మంచానికే పరిమితమయ్యేసరికి నాజర్ మానసికంగా కృంగిపోయాడు. ఇదే పెద్ద బాధ అనుకుంటే పూర్తిగా గతాన్ని మర్చిపోవడం నాజర్‌ని మరింత వేదనకు గురిచేసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. నాజర్ కొడుకు వాళ్ల ఫ్యామిలీని మర్చిపోయాడు గానీ హీరో విజయ్‌ని గుర్తుపెట్టుకున్నాడు. టీవీలో అతడి పాట వచ్చినా, సినిమా వచ్చినా డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ విషయం తెలిసి విజయ్.. ఈ ఏడాది నాజర్ పెద్ద కొడుకు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు.  ఇలా తెరపై అద్భుతమైన నటనతో అలరిస్తున్న నాజర్ జీవితంలో ఇంత విషాదం ఉందని బహుశా మీలో చాలామందికి తెలిసుండకపోవచ్చేమో!

(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో గందరగోళం.. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్!)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)