Breaking News

త్వరలోనే పవిత్రా లోకేశ్‌ను పెళ్లి చేసుకుంటా: నరేష్‌

Published on Fri, 05/19/2023 - 12:57

సీనియర్‌ నటుడు వీకే నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే.కొన్నాళ్లుగా ఈ జంట పేర్లు సోషల్‌మీడియలో తెగ ట్రెండింగ్‌లో ఉన్నాయి. గతంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ఈ జంట అదంతా సినిమా కోసమంటూ ట్విస్ట్‌ ఇచ్చారు. వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమా మళ్లీ పెళ్లి.

పైకి మాత్రం అది మా స్టోరీ కాదంటూనే నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు నరేశ్. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను పెంచేసిన నరేష్‌-పవిత్ర ప్రమోషన్స్‌ కోసం మళ్లీ రెచ్చిపోయారు. ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం అంటూ ఇటీవలె ముద్దులతో స్టేజ్‌పై రెచ్చిపోయిన నరేష్‌ తాజాగా కర్ణాటకలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇద్దరి అభిప్రాయాలు, మనసు కలవడంతో కలిసి ఉంటున్నామని, అందరి ఆశీస్సులతో త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకుంటా అంటూ నరేష్‌ తెలిపాడు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'నిజానికి పెళ్లి అన్నది కశ్చితంగా అవసరం కాదు.

చాలామంది ఇష్టం లేకపోయినా, సోసైటీ కోసం పెళ్లి బంధంలో ఉంటున్నారు. అలాంటి వాళ్లందరికోసమే మళ్లీ పెళ్లి సినిమా. ఇది మా బయోపిక్‌ కాదు. పవిత్రకు నాకు ఇంకా పెళ్లి కాలేదు..కానీ త్వరలోనే చేసుకుంటా' అంటూ నరేష్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)