Breaking News

నారా రోహిత్‌ పెళ్లి సందడి.. హీరోయిన్‌ ఇంట హల్దీ ఫంక్షన్‌

Published on Sun, 10/19/2025 - 11:13

టాలీవుడ్‌లో హీరో నారా రోహిత్‌ (Nara Rohith) పెళ్లికి సమయం ఆసన్నమైంది. రోహిత్‌-శిరీష (Siree Lella) జంట ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని శిరీష సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. పసుపు దంచే కార్యక్రమం జరిగిందంటూ కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. చీర కట్టుకుని సాంప్రదాయంగా ముస్తాబైన శిరీష.. తన కుటుంబసభ్యులతో కలిసి పసుపు దంచింది.

ఆ సినిమాతో ప్రేమ షురూ
‍నారా రోహిత్‌ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష యాక్ట్‌ చేసింది. ఈ మూవీలో రోహిత్‌ ప్రియురాలిగా నటించింది. నిజ జీవితంలోనూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పారు. మనసులు ఒక్కటయ్యాక ఆశీర్వదించకుండా ఎలా ఉంటామంటూ ఇరు కుటుంబాలు గతేడాది అక్టోబర్‌లో వీరికి ఎంగేజ్‌మెంట్‌ చేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు.

సినిమా
బాణం సినిమాతో వెండితెరపై హీరోగా పరిచయమయ్యాడు రోహిత్‌. సోలో మూవీతో హిట్‌ కొట్టాడు. ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద, శమంతకమణి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. 2018లో వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు బ్రేక్‌ తీసుకున్నాడు. ప్రతినిధి 2తో రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. ఈ ఏడాది భైరవం, సుందరకాండ సినిమాలతో మెప్పించాడు.

 

 

చదవండి: బండ్ల గణేశ్‌ దీపావళి పార్టీ.. హాజరైన టాలీవుడ్‌ స్టార్స్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)