Breaking News

చిన్నప్పటి ఫోటోతో అక్కకు 'బర్త్‌డే శుభాకాంక్షలు' చెప్పిన స్టార్‌ హీరో

Published on Wed, 05/21/2025 - 09:29

హీరో నాని తన సోదరి దీప్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే, తమ చిన్ననాటి ఫోటోను షేర్‌ చేసి అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాదిలో తమ సొంత ఫ్రాంచైజీలో భాగమై ‘హిట్‌ 3’లో నాని నటించారు. ఆపై కోర్టు సినిమాను సొంత బ్యానర్‌లోనే తెరకెక్కించి భారీ హిట్‌ అందుకున్నారు. అయితే, ఈ విజయాల్లో నాని సోదరి దీప్తి పాత్ర చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఆమె సహ నిర్మాతగా కూడా కోర్టు సినిమాకు ఉన్నారు.

నాని సోద‌రి దీప్తి గంటా ఒక డైరెక్టర్ కూడా.. గతంలో  ‘మీట్ క్యూట్’ అనే చిత్రాన్ని ఆమె తెరకెక్కించారు. వాల్ పోస్ట‌ర్ సినిమా ప‌తాకంపై నాని స‌మ‌ర్పిస్తుండ‌గా ప్ర‌శాంతి నిర్మించారు. గ‌తంలోనూ 'అన‌గ‌న‌గా ఒక నాన్న' అనే షార్ట్‌ఫిలిం కోసం ఆమె  ద‌ర్శ‌క‌త్వం వహించిన దీప్తి తన ప్ర‌తిభ చూపారు. అలా సినిమాతో ఆమెకు మంచి కనెక్షన్‌ ఉంది. అ!, హిట్‌ ఫ్రాంచైజీ చిత్రాలు, కోర్టు వంటి సినిమాలకు దీప్తి పనిచేశారు. అలా తన అక్కతో నాని చిత్ర పరిశ్రమలో సూపర్‌గా విజయాలు అందుకుంటున్నారు. ఈరోజు ఆమె పుట్టినరోజు కావడంతో ఇలా ఫోటో షేర్‌ చేశారు. 'అక్కీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ వేడుకలు జరుపుకోవడానికి నేను వేచి ఉండలేను.' అంటూ తెలిపాడు.

హీరో నాని ఫ్యామిలీ మ్యాన్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. సినిమాకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో తన కుటుంబానికి కూడా అంతే సమయం కేటాయిస్తాడు. ఇప్పుడు సినిమాపై తనకున్న మక్కువతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్తవారికి ఛాన్సులు కల్పిస్తున్నాడు. వాస్తవానికి చిత్రపరిశ్రమకు నాని చాలామంది దర్శకులను పరిచయం చేశారు. వారితో విజయాలను కూడా అందుకున్నారు. 
 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)