నేనూ సైబర్ క్రైమ్ బాధితుడినే.. నెలకొకసారి అలా చేస్తుంటా

Published on Fri, 08/14/2026 - 12:33

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 'తిరంగా కా సురక్ష' పేరుతో శుక్రవారం ఓ అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న తెలుగు హీరో నాగార్జున.. తానూ సైబర్‌ క్రైమ్‌ బాధితుడినేనని చెప్పి షాకిచ్చారు. నాలుగేళ్ల క్రితం సైబర్‌ ఫ్రాడ్‌కి గురయ్యానని, బ్యాంక్ అధికారి పేరుతో కాల్‌ వచ్చిన సంగతి బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు: ఉప్పల్ బాలు)

'మేం ఇంజనీరింగ్ చదివే టైంలో అంటే 1977లో అపుడే కంప్యూటర్స్ వచ్చాయి. మా కాలేజీ రోజుల నుంచే మెయిల్ అకౌంట్స్ మాల్ వేర్స్, హ్యాకింగ్ జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలని ప్రొఫెసర్లు హెచ్చరించేవారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సైబర్ క్రైమ్ సమస్య కొనసాగుతూనే ఉంది. నేను కూడా సైబర్ ఫ్రాడ్ బాధితుడినే. ఐదేళ్ల క్రితం బ్యాంక్ ఆఫీసర్‌నని ఓ వ్యక్తి కాల్ చేశాడు. మార్కెటింగ్ గురించి బాగా తెలిసిన వ్యక్తి నన్ను ఇన్వెస్ట్‌మెంట్ గురించి బలవంతం చేశాడు. అంతెందుకు మాయమాటలతో మా కుటుంబంలోనే కొందరిని ఆరు ఏడు గంటల పాటు డిజిటల్ అరెస్ట్ కూడా చేశారు'

'విదేశాలకు నార్కోటిక్ సబ్‌స్టాన్స్ పార్సిల్ పేరుతో కాల్స్ చేసేవారు.  అయితే సైబర్ క్రైమ్ నేరాలని అరికట్టడంలో దేశంలోనే తెలంగాణ సైబర్ పోలీస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. నేను వారానికి ఒకసారి మొబైల్ పాస్ వర్డ్, నెలకోసారి వైఫై పాస్‌వార్డ్స్ మారుస్తూ ఉంటాను. నా మొబైల్‌లో కనీసం ఫొటోలు కూడా తీసుకోను. ఇండస్ట్రీలో పైరసీ అరికట్టడం కోసం సీవీ ఆనంద్, సజ్జనార్ ఎంతగానో కృషి చేశారు. ఈ విషయంలోనూ తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ స్థానంలో ఉంటారు. ఇతర దేశాలకు వెళ్లి మరీ సైబర్ నేరస్థులని పట్టుకుని అరెస్ట్ చేశారు. జాగ్రత్తగా ఉంటూ సైబర్ నేరాలని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది' అని నాగార్జున ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ)

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)