శంబాలపై పాజిటివ్‌ వైబ్‌ ఉంది: కిరణ్‌ అబ్బవరం

Published on Tue, 12/23/2025 - 00:07

‘‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’ సినిమాలో ధర్మపాత్ర కోసం సాయి కుమార్‌గారిని కలిసినప్పుడు ఆయన మాకు చేసిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన వల్లే నా కెరీర్‌ బాగుందనుకుంటూ ఉంటాను. ‘శంబాల’ చిత్రంపై ముందు నుంచి పాజిటివ్‌ వైబ్‌ ఉంది.. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ మూవీతో ఆదిగారికి మంచి విజయం రావాలి’’ అని కిరణ్‌ అబ్బవరం తెలిపారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్‌ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్‌ ముని దర్శకత్వంలో షైనింగ్‌ పిక్చర్స్‌పై రాజశేఖర్‌ అన్నభీమోజు, మహీధర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హీరోలు మంచు మనోజ్, కిరణ్‌ అబ్బవరం, ప్రియదర్శి, అశ్విన్‌ బాబు, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్, నిర్మాతలు నవీన్‌ యెర్నేని, టీజీ విశ్వ ప్రసాద్, మైత్రి శశిధర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంచు మనోజ్‌ మాట్లాడుతూ–‘‘చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు.. మంచి చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు’’ అన్నారు.

‘‘సాయికుమార్‌గారి కొడుకుని అని చెప్పుకోవడాన్ని గర్వంగా భావిస్తాను’’ అని ఆది సాయికుమార్‌ తెలిపారు. ‘‘ఈ చిత్రంతో ఆదికి మంచి విజయం దక్కాలి’’ అన్నారు అనిల్‌ రావిపూడి.      ‘‘శంబాల’తో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీమ్‌కి విజయోత్సాహం రావాలని కోరుకుంటున్నాను’’ అని నటుడు సాయికుమార్‌ చెప్పారు. ‘‘నా టీమ్‌ సపోర్ట్‌ వల్లే సినిమాను ఇంత గొప్పగా తీశాను’’ అని యుగంధర్‌ ముని పేర్కొన్నారు.

Videos

పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ

దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు

వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే

థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్

రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు

దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు

టీడీపీ నేతల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

గురజాలలో ఉద్రిక్తత

Photos

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)