Breaking News

భార్యతో విడాకులు.. అలాంటివారే రూమర్స్ క్రియేట్ చేస్తారు: జయం రవి

Published on Thu, 10/24/2024 - 18:54

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయం రవి విడాకుల తర్వాత తనపై వచ్చిన రూమర్స్‌పై తొలిసారి స్పందించారు. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన ‍అవసరం లేదన్నారు.

జయం రవి మాట్లాడుతూ.. 'మేము పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాం. నేను బయట టీ తాగినా..ఏ చేసినా తెలిసిపోతుంది. ఎందుకంటే మేము సినిమా వ్యక్తులం. మమ్మల్ని ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. వారి అభిప్రాయాలు కూడా వెల్లడిస్తుంటారు. మేమైతే వాటిని అడ్డుకోలేం కదా. కొంతమంది పరిణితి చెందిన వారు ఇలాంటి రూమర్స్‌ను పట్టించుకోరు. పరిపక్వత లేని కొద్దిమంది మాత్రమే రూమర్స్ వ్యాప్తి చేయడం చేస్తుంటారు. కొంతమంది ఆ విషయంలో ఉన్న తీవ్రత అర్థం చేసుకోకుండా మాట్లాడతారు.  కానీ నా గురించి నాకు పూర్తిగా తెలిసినప్పుడు ఇలాంటి వాటి గురించి తెలుసుకుని ఎందుకు బాధపడతాం' అని అన్నారు.

(ఇది చదవండి: మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు: ఆర్తి)

కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే తన అనుమతి లేకుండానే విడాకుల ప్రకటన విడుదల చేశారని ఆయన భార్య ఆర్తి ఆరోపించింది. అయితే ఆమె మాటల్లో ఎలాంటి నిజం లేదని జయం రవి క్లారిటీ ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)