కన్నడ హీరో దర్శన్‌కు బిగ్‌ షాక్.. పోలీసుల అదుపులో నటుడు!

Published on Thu, 08/14/2025 - 16:31

కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్యకేసులో హీరో దర్శన్‌కు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్శన్‌ బెయిల్ సుప్రీం రద్దు చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దర్శన్‌తో పాటు పవిత్ర గౌడను కూడా అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వడం వక్రబుద్ధితో సమానమని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కాగా... బెంగళూరులో జరిగిన రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, అతనితో పాటు ప్రియురాలు, నటి పవిత్ర గౌడ నిందితులుగా ఉన్నారు. జూన్ 11, 2024న పోలీసులు అరెస్టు చేశారు. పవిత్ర గౌడ అభిమానిగా చెప్పుకునే రేణుకస్వామి నటికి అసభ్యకరమైన సందేశాలు పంపాడని.. అతన్ని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని ఆరోపణలొచ్చాయి. 

ఈ కేసులో దర్శన్‌తో పాటు పవిత్ర గౌడను కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది జూన్ 8న బెంగళూరులోని ఒక మురుగు కాలువలో రేణుకస్వామి మృతదేహం లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఐదు నెలలు జైలులో ఉన్న తర్వాత డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా సుప్రీం బెయిల్ రద్దు చేయడంతో మరోసారి దర్శన్‌ను జైలుకు పంపనున్నారు.

అసలు ఏం జరిగిందంటే?
పోలీసుల అభియోగాల ప్రకారం..  చాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌కు వీరాభిమాని అయిన రేణుకాస్వామి నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. 2024 జూన్‌లో దర్శన్, అతని సహచరులు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని షెడ్‌లో మూడు రోజుల పాటు హింసించారు. అనంతరం అతని శవాన్ని డ్రెయిన్‌లో పడేశారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్‌ అయ్యారు. ఆ సమయంలో వాళ్లకు అందిన వీఐపీ ట్రీట్‌మెంట్‌పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దర్శన్‌ను మరో జైలుకు మార్చారు. ఆపై వాళ్లు బెయిల్‌ మీద బయటకు వచ్చారు. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)