Breaking News

భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. నేనే వినలేదు: ఛత్రపతి శేఖర్‌

Published on Sat, 11/01/2025 - 12:44

స్టూడెంట్‌ నెం.1, సింహాద్రి, సై, విక్రమార్కుడు, ఛత్రపతి, మగధీర, ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇలా తెలుగులో అనేక హిట్‌ సినిమాల్లో నటించాడు చంద్రశేఖర్‌. అయితే ఛత్రపతి శేఖర్‌గానే స్థిరపడిపోయాడు. వెండితెరపై క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఓ వెలుగు వెలిగిన ఇతడు బుల్లితెరపై సీరియల్స్‌ కూడా చేస్తున్నాడు. తాజాగా శేఖర్‌ ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఓపింక నశించి..
ఛత్రపతి శేఖర్‌ (Actor Chatrapathi Sekhar) మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటినుంచే సినిమాలంటే ఇష్టం. దేవదాసు కనకాల ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాను. పెళ్లయ్యాకే ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. మంచి గుర్తింపు వచ్చింది. ఒకానొక సమయంలో మా మధ్య గొడవలు వచ్చాయి. మా మధ్య ఓపిక నశించిపోయింది. రోజూ కొట్లాడుకుని పరేషాన్‌ అయ్యేబదులు దూరంగా ఉంటే మంచిదనుకున్నాం. 

నాదే తప్పు
ఒకరి మనసు మరొకరు నొప్పించకుండా విడిపోతే బెటర్‌ అని ఫీలయ్యాం. అయితే తప్పంతా నాదే! నేను బద్ధకస్తుడిని. ఏదైనా చెప్తే వినను. వాళ్లను, వీళ్లను కలువు.. పని దొరికితే డబ్బులొస్తాయని ఆమె అనేది. నేనేమో బద్ధకస్తుడిలా ప్రవర్తించేవాడిని. ఇలా మేము విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. చేయిచాచి సాయం అడిగినవారికి కాదనుకుండా డబ్బులిచ్చేవాడిని. వాళ్లు తిరిగిచ్చేవాళ్లు కాదు, నేను కూడా ఫోన్‌ చేసి అడిగేవాడ్ని కాను.

ఫోన్‌ చేసింది, కానీ డబ్బయితే ఇవ్వలేదు
బిగ్‌బాస్‌ ఫేమ్‌, సీరియల్‌ నటి కీర్తి భట్‌ను నా కూతురిలాగే చూసుకున్నాను. తనకు డబ్బు సాయం చేస్తే ఇంతవరకు తిరిగివ్వలేదని ఓ ఇంటర్వ్యూలో అన్నాను. అది చూసి కీర్తి నాకు ఫోన్‌ చేసింది. నా గురించి ఎందుకలా నెగెటివ్‌గా మాట్లాడారంది. చూస్తే అందులో నేనేమీ తప్పు మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా ఒకటీరెండుసార్లు ఫోన్‌ చేసింది. కానీ, నాకివ్వాల్సిన డబ్బు మాత్రం తిరిగివ్వలేదు. నేను కూడా అడగలేదు. మనసిచ్చి చూడు సీరియల్‌లో నేను సంపాదించినదానికన్నా పోగొట్టుకుందే ఎక్కువ. అడిగినవారికల్లా పంచేశాను. 

పెళ్లి - విడాకులు
బిగ్‌బాస్‌ షోలో ఛాన్స్‌ వస్తే అస్సలు వెళ్లను. ఒకవేళ వెళ్తే రెండు రోజుల్లో తిరిగొచ్చేస్తాను అని శేఖర్‌ చెప్పుకొచ్చాడు. చంద్రశేఖర్‌.. నీల్యా భవానీని పెళ్లి చేసుకున్నాడు. ఈమె కూడా సినిమాల్లో చిన్న పాత్రలు పోషించేది. ఈ దంపతులకు ఓ కుమారుడు, కూతురు సంతానం. మనస్పర్థల వల్ల శేఖర్‌-భవానీ విడాకులు తీసుకుని వేర్వేరుగా జీవిస్తున్నారు. ప్రస్తుతం అతడి భార్యాపిల్లలు అమెరికాలో ఉంటున్నారు. మనసిచ్చి చూడు సీరియల్‌లో కీర్తి భట్‌ తండ్రిగా నటించాడు శేఖర్‌. యాక్సిడెంట్‌లో అమ్మానాన్నని కోల్పోయిన కీర్తి.. ఈ సీరియల్‌ తర్వాత శేఖర్‌ను నాన్న అని పిలవడం మొదలుపెట్టింది.

చదవండి: మాజీ కోడలిపై ఎంత ప్రేమో? బర్త్‌డే మనవరాలిదైతే బహుమతులు..!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)