8 ఏళ్లు కష్టపడ్డా.. చెంపపై పదే పదే కొట్టుకున్న నటుడు

Published on Thu, 08/06/2026 - 09:52

సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. కొందరికి త్వరగా అవకాశాలు వస్తే..మరికొందరికి ఏళ్లు పడతాయి. అయినా కూడా ఫ్యాషన్‌తో కొంతమంది చిత్రపరిశ్రమను వదిలిపెట్టి రారు. తమ టాలెంట్‌ని నిరూపించుకునేందుకు ఒక్క చాన్స్‌ వచ్చినా చాలు అంటూ ఆశగా ఎదురు చూస్తుంటారు. అలా ఓ నటుడికి 8 ఏళ్ల తర్వాత బిగ్‌స్క్రీన్‌పై చూసుకునే అవకాశం వచ్చింది. తన కల నిజం కావడంతో.. స్టేజ్‌పైనే భావోద్వేగానికి లోనయ్యాడు.  

అన్షు, వాసవి గణేశన్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘హుషార్‌ పిట్టలు’.  ఇందులో భాను అనే నటుడు కీలక పాత్ర పోషించాడు. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ.. ఎమోషనల్‌ అయ్యాడు. 

‘సినిమాల్లో రావడానికి 8 ఏళ్లు కష్టపడ్డా. ఎంతమంది హేళన చేసిన భరించా. స్క్రీన్‌ మీద నన్ను నేను చూసుకొని నమ్మలేకపోతున్నా. నేను అంత పెద్ద స్క్రీన్‌మీద ఉన్నానా.. ఇది కలనా, నిజమా’ అంటూ చెంపపై పదేపదే కొట్టుకున్నాడు. దీంతో స్టేజ్‌ మీద ఉన్నవాళ్లంతా షాక్‌ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)