Breaking News

నిర్మాతల లాభాలపైనే నా పారితోషికం: నటుడు బాలాజి

Published on Sat, 01/21/2023 - 10:55

తమిళసినిమా: నటుడు కార్తీ కథానాయకుడిగా సర్ధార్‌, శశికుమార్‌ హీరోగా కారి వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను నిర్మించిన ప్రిన్స్‌ పిక్చర్స్‌ సంస్థ అధినేతలు ఏ.లక్ష్మణన్, వెంకట్‌ ప్రస్తుతం వరుసగా పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. అందులో ఒకటి రన్‌ బేబీ రన్‌. నటుడు దర్శకుడు ఆర్జే బాలాజి కథానాయకుడిగా నటించిన ఇందులో నటి ఐశ్వర్యరాజేష్‌ కథానాయకిగా నటించారు. నటి రితిక, వివేక్‌ ప్రసన్న, విశ్వ, రాజా అయ్యప్ప ప్రధాని పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యువ చాయాగ్రహణం, శ్యాంసిఎస్‌ సంగీతాన్ని అందించారు.

చదవండి: నాతో షూటింగ్‌ చేసి చివరికి వేరే హీరోయిన్‌ను తీసుకున్నారు: రకుల్‌

మలయాళ దర్శకుడు జయన్‌ కృష్ణకుమార్‌ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక టీనగర్‌లోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు. ఈ వేదికపై దర్శకుడు జయన్‌ కృష్ణకుమార్‌ మాట్లాడుతూ.. తాను మలయాళంలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించానని చెప్పారు. ఇప్పుడు తమిళంలో చిత్రం చేయడం కొత్త అనుభవంగా పేర్కొన్నారు. ఈ కథను లక్ష్మణన్‌కు  చెప్పగా ఆయనే నటుడు ఆర్జే బాలాజీని హీరోగా సూచించారన్నారు.

చదవండి: యాంకర్‌ రష్మీ ఇంట తీవ్ర విషాదం

కథ వినగానే బాగా నచ్చిందని అంతగా దర్శకుడు కథను పకడ్బందీగా తయారు చేశారని నిర్మాత లక్ష్మణన్‌ పేర్కొన్నారు. నటుడు ఆర్జే బాలాజి మాట్లాడుతూ దర్శకుడు జయన్‌ కృష్ణకుమార్‌ తనను కలిసి చిరునవ్వుతోనే కథలు చెప్పారన్నారు. అంద 7 నాట్కళ్‌ చిత్రం కె..భాగ్యరాజ్‌కు మరుజన్మే ఆయన పేర్కొన్నారు. ఈయన ప్రతిభావంతులైన టీమ్‌ను నియమించుకున్నారన్నారు. నిర్మాత లక్ష్మణన్‌ ఖర్చుకు వెనకాడకుండా ప్రముఖ సాంకేతిక నిపుణులతో చిత్రాన్ని భారీగా నిర్మించారన్నారని తెలిపారు.  తన పారితోషికం గురించి అడుగుతున్నారని, అది నిర్మాతల లాభాలను బట్టి ఉంటుందని ఆర్జే బాలాజి పేర్కొన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)