Breaking News

శత్రువులు కూడా మిత్రువులే.. 'అద్దం' స్పెషల్‌ గిఫ్ట్‌!

Published on Sat, 01/03/2026 - 18:31

తమిళ నటుడు బాలా.. భార్య కోకిలతో కలిసి కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు. ఈ సందర్భంగా భార్య అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. కొత్త సంవత్సరంలో తాను అందుకున్న స్పెషల్‌ గిఫ్ట్‌ అద్దం అని తెలిపాడు.తన సోదరి అమెరికా నుంచి ఈ బహుమతి పంపిందని, ఆ గిఫ్ట్‌ తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు.

శత్రువుల్లేరు
ట్రోల్స్‌ను ఎలా డీల్‌ చేస్తావని కోకిల ప్రశ్నించింది. అందుకు బాలా స్పందిస్తూ.. మనం ఎదుటివారిని చూసేదాన్ని బట్టి వారు శత్రువులుగా కనిపిస్తారు. అదే ఫ్రెండ్స్‌గా చూస్తే.. ఇంకా శత్రువులుగా ఎందుకుంటారు? అని బదులిచ్చాడు. 2026లో నరదృష్టి ఉండకూడదని,  అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

ముందడుగు
పర్సనల్‌ లైఫ్‌ గురించి మాట్లాడుతూ.. మా పెళ్లి తర్వాత కూడా మేము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. ఈ కొత్త సంవత్సరం మా జీవితాల్లో ఓ అడుగు ముందుకు వేయబోతున్నాం. సినిమాల విషయానికి వస్తే.. నాలుగైదు కథలు విన్నాను, కానీ ఇంకా దేనికీ ఓకే చెప్పలేదు. అర్థవంతమైన పాత్రలు మాత్రమే చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.

నాలుగు పెళ్లిళ్లు
బాలా వైవాహిక జీవితం విషయానికి వస్తే.. 2008లో చందన సదాశివ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాదికే ఆమెతో విడిపోయాడు. 2010లో మలయాళ సింగర్‌ అమృతా సురేశ్‌ను పెళ్లాడగా వీరికి ఓ కూతురు జన్మించింది. ఈ దంపతులు కూడా ఎంతోకాలం కలిసుండలేదు. 2019లో విడాకులు తీసుకున్నారు. 2021లో డాక్టర్‌ ఎలిజబెత్‌ ఉదయన్‌ను వివాహం చేసుకోగా వీరు కూడా విడిపోయారు. రెండేళ్ల క్రితం చుట్టాలమ్మాయి కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.

చదవండి: పోకిరి విలన్‌కు యాక్సిడెంట్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)