Breaking News

పోకిరి విలన్‌కు యాక్సిడెంట్‌.. ఆస్పత్రిలో వీడియో రిలీజ్‌

Published on Sat, 01/03/2026 - 16:33

ప్రముఖ నటుడు, పోకిరి విలన్‌ ఆశిష్‌ విద్యార్థి పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. భార్య రూపాలి బరువాతో కలిసి శుక్రవారం రాత్రి గువహటిలో బయట డిన్నర్‌ చేశాడు ఆశిష్‌. డిన్నర్‌ తర్వాత రోడ్డు దాటే క్రమంలో స్పీడుగా వస్తున్న ఓ బైక్‌ వీరిని ఢీ కొట్టింది. అది గమనించిన స్థానికులు వెంటనే బైకర్‌తో పాటు ఆశిష్‌ దంపతులను ఆస్పత్రిలో చేర్పించారు.

యాక్సిడెంట్‌ 
ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆశిష్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చాడు. నిన్న రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్‌ అయింది. ప్రస్తుతానికి ఇద్దరం క్షేమంగానే ఉన్నాం. రూపాలిని ఇంకా అబ్జర్వేషన్‌లో ఉంచారు. నాకు చిన్న గాయం అయింది, కానీ లేచి నడవగలను, మాట్లాడగలను. మీ ఆశీస్సుల వల్ల అంతా బానే ఉంది. భయపడాల్సిందేమీ లేదు అని చెప్పుకొచ్చాడు.

సినిమా
ఆశిష్‌ విద్యార్థి.. గుడుంబా శంకర్‌, అన్నవరం, నరసింహుడు, అతిథి, తులసి, చిరుత, కంత్రి, అదుర్స్‌, నాయక్‌, ఆగడు, కిక్‌ 2, నాన్నకు ప్రేమతో, ఇస్మార్ట్‌ శంకర్‌.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, బెంగాలీ, మలయాళ, మరాఠి భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. చివరగా 'ద ట్రేటర్స్‌' అనే రియాలిటీ షోలో కనిపించాడు. ఆశిష్‌ గతంలో రాజోషిని పెళ్లి చేసుకోగా వీరికి కుమారుడు అర్థ్‌ సంతానం. పలు కారణాల రీత్యా 2022లో దంపతులు విడిపోయారు. ఆ మరుసటి ఏడాది ఆశిష్‌.. రూపాలి బరువాను రెండో పెళ్లి చేసుకున్నాడు.

 

 

చదవండి: మగాడిలా తయారవుతున్నావ్‌.. నటి కూతురి కౌంటర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)