బోనీ కపూర్ కూతురి పెళ్లి.. పంజాబీ సంప్రదాయంలో వేడుకలు

Published on Mon, 07/06/2026 - 16:50

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూతురు త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఆయన మొదటి భార్య కూతురైన అన్షులా కపూర్ పెళ్లి వేడుకలు ఇటీవలే మొదలయ్యాయి. గతేడాది ప్రియుడు రోహన్ థక్కర్‌తో నిశ్చితార్థం చేసుకున్న అన్షులా ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది.

పెళ్లి వేడుకల్లో భాగంగా పంజాబీ సంప్రదాయంలో చుడా వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో అన్షులా కపూర్ బ్రదర్ అర్జున్ కపూర్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. తన సిస్టర్‌ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పంచుకుంది అన్షులా కపూర్. అతను ఇంత నిబద్ధతతో ఉండటం తాను ఎప్పుడూ చూడలేదని అన్షులా సరదాగా వ్యాఖ్యానించింది.  ఈ వేడుకలో ఖుషీ కపూర్, ఓరీతో పాటు కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు. పంజాబీ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక సమయంలో కలీరా ఎవరి తలపైనైనా పడితే.. నెక్ట్స్ ఆ వ్యక్తి  వివాహం చేసుకోబోతున్నారని నమ్ముతారు.

కాగా.. అన్షులా కపూర్, రోహన్ థక్కర్‌ల  నిశ్చితార్థం జూలై 2025లో జరిగింది. 2022లో ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా మొదటిసారి కలుసుకున్నామని అన్షులా వెల్లడించింది. కాగా.. నిర్మాత బోనీ కపూర్‌ మొదటి భార్య పేరు మోనా శౌరీ కపూర్‌. ఈవిడ కూడా నిర్మాతే! వీరిద్దరూ 1983లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అర్జున్‌ కపూర్‌, అన్షులా కపూర్‌ సంతానం. 1996లో బోనీ.. భార్య మోనాకు విడాకులిచ్చాడు. అదే ఏడాది హీరోయిన్‌ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జాన్వీ కపూర్‌, ఖుషి కపూర్‌ సంతానం. కాగా మోనా శౌరీ.. 2012లో కన్నుమూయగా, శ్రీదేవి 2018లో మరణించింది. జాన్వీ, ఖుషి సవతి తల్లి కూతుర్లయినప్పటికీ అర్జున్‌, అన్షులా.. వారితో అన్యోన్యంగా ఉంటారు. ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)