Breaking News

సింగిల్‌గా అన్న.. రెండోపెళ్లితో రెండోసారి తండ్రి కాబోతున్న తమ్ముడు

Published on Wed, 06/11/2025 - 12:31

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటుంటారు. కానీ ఈ జనరేషన్‌కు అది వర్తించదు. కెరీర్‌ వేటలో పడి ఆలస్యంగా పెళ్లి చేసుకుని లేటుగా సంసారసాగరాన్ని ఈదుతున్నారు. కొందరైతే మనవళ్లను ఎత్తుకోవాల్సిన వయసులో మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరే పెళ్లి అనే జంఝాటమే వద్దని సింగిల్‌గా బతికేస్తున్నారు.

57 ఏళ్ల వయసులో మరోసారి తండ్రిగా..
బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) విషయంలో ఇదే జరిగింది. ఎంతోమంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినా పెళ్లికి మాత్రం సిద్ధపడలేదీ హీరో. 59 ఏళ్లు వచ్చినా సింగిల్‌గానే బతికేస్తున్నాడు. కానీ, ఇతడి సోదరుడు, నటుడు అర్బాజ్‌ ఖాన్‌ (Arbaaz Khan) మాత్రం 57 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్నాడు.

పట్టలేనంత సంతోషం
అర్బాజ్‌ భార్య షురా ఖాన్‌ గర్భం దాల్చిందన్న విషయాన్ని నటుడు మీడియాకు వెల్లడించాడు. మేము బయటకు వెళ్లినప్పుడు జనాలు ఆ విషయాన్ని ఇట్టే పసిగట్టారు. దాన్ని ఎంతోకాలం దాచలేమనుకోండి. ప్రస్తుతం మేమెంతో సంతోషంగా ఉన్నాం. మా జీవితాల్లో మరింత వెలుగు నింపేందుకు వస్తున్న బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం అన్నాడు.

రెండో పెళ్లి
అర్బాజ్‌ గతంలో మలైకా అరోరాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు అర్హాన్‌ ఖాన్‌ సంతానం. 2017లో అర్బాజ్‌-మలైకా విడాకులు తీసుకున్నారు. 2023 చివర్లో మేకప్‌ ఆర్టిస్ట్‌ షురా ఖాన్‌ను నిఖా చేసుకున్నాడు. సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో ఎన్నో మూవీస్‌ చేసిన అర్బాజ్‌ తెలుగులో 'జై చిరంజీవ', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'శివం భజే' వంటి చిత్రాల్లో నటించాడు.

చదవండి: ప్రముఖ సింగర్‌ బర్త్‌డే పార్టీలో గంజాయి కలకలం

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)