Breaking News

రాజేంద్ర ప్రసాద్‌ వ్యాఖ్యలపై అలీ రియాక్షన్‌ ఇదే

Published on Mon, 06/02/2025 - 15:25

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో చాలామంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఆ వేదికపై నటుడు రాజేంద్ర ప్రసాద్‌( Rajendra Prasad) చేసిన వ్యాఖ్యలు తలదించుకునేలా ఉన్నాయి. ప్రముఖ కమెడియన్‌ అలీపై రాజేంద్ర ప్రసాద్‌ చేసిన అత్యంత నీచమైన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.  ఈ క్రమంలో తాజాగా నటుడు అలీ కూడా ఒక వీడియో ద్వారా సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

రాజేంద్ర ప్రసాద్‌ గురించి నటుడు అలీ ఇలా అన్నారు. 'ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో  రాజేంద్ర ప్రసాద్‌ అనుకోకుండా అలాంటి మాటలు అన్నారు. ఉద్దేశపూర్వకంగా అనలేదు. పోరాపాటున మాట తూలింది. కానీ, మీడియా మిత్రులు దానిని వైరల్‌ చేస్తున్నారు. ఆయనొక మంచి నటుడు, కొద్దిరోజుల క్రితం తనకు అమ్మలాంటి కూతురు మరణం వల్ల పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఆయన పెద్దాయన, కావాలని అనలేదు.' అని నటుడు అలీ అన్నారు.

హాస్య నటుడు అలీని అనరాని మాట అన్న రాజేంద్ర ప్రసాద్

రాజేంద్ర ప్రసాద్‌ తన వ్యాఖ్యల పట్ల తప్పు తెలుసుకుని అలీకి క్షమాపణలు చెబుతారని అందరూ భావించారు. కానీ, ఆయన అలాంటి పనిచేయకుండా తను అన్న మాటలను సమర్ధించుకుంటూ.. మరోసారి తన నోటికి పని చెప్పారు. తాను మాట్లాడిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని రాజేంద్ర ప్రసాద్ ఇలా వివరణ ఇచ్చారు. 'నా మాటలను అర్థం చేసుకోవడం అనేది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. నేను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకుంటే మీ ఖర్మ. దానికి ఎవరూ ఏం చేయలేం. నేనైతే ఇలాగే సరదాగా ఉంటాను.' అని అన్నారు.

 

Videos

YSRCP కాదు.. పక్కా జనసేన.. వాడికి పవన్ అంటే పిచ్చి.. అజయ్ దేవ్ చెల్లి షాకింగ్ నిజాలు

ఎవరికీ భయపడను! శివాజీ మరో సంచలన వీడియో

హిప్పో జర తప్పుకో, ఈ సెక్యూరిటీ ధైర్యానికి సలాం!

ఆంధ్రా కిమ్ నారా లోకేష్

పవన్ పీకింది చాలు! డిప్యూటీ సీఎంవా.. ఆకు రౌడీవా!

మార్కెట్లోకి Ai వాషింగ్ మిషన్లు

ఆడవారి దుస్తులపై మాట్లాడే హక్కు శివాజీకి లేదు

పొట్టు పొట్టు కొట్టుకున్న ఇప్పటం జనసేన నేతలు

శభాష్ ఇస్రో.. YS జగన్ ప్రశంసలు

శ్రీలంకతో జరిగిన రెండో T-20లో భారత్ విజయం..

Photos

+5

వారణాసి ట్రిప్‌లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో ఫుల్ గ్లామరస్‌గా అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)

+5

#INDvsSL : విశాఖలో విశ్వవిజేతల దండయాత్ర (ఫొటోలు)

+5

మహేష్‌ బాబు ఫ్యామిలీలో వేడుక.. ఫోటోలు వైరల్‌

+5

అదరగొట్టిన విల్లా మేరీ కాలేజ్ విద్యార్థినులు (ఫొటోలు)

+5

‘ఈషా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కోలీవుడ్ స్టార్‌ కమెడియన్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వైఎస్ జగన్‌ ప్రజాదర్బార్‌: సమస్యలు వింటూ.. భరోసా కల్పిస్తూ.. (ఫొటోలు)

+5

నా సూపర్‌స్టార్‌: భార్యకు సంజూ శాంసన్‌ విషెస్‌ (ఫొటోలు)