Breaking News

రూ.100 కోట్లు.. కాదు వెయ్యి.. రెండు వేల కోట్ల FD ఉంటే చాలు!

Published on Mon, 09/22/2025 - 12:54

దేశంలోని అత్యంత ధనిక నటుల్లో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) ఒకరు. ఒకానొక సమయంలో భారత్‌లో అత్యధిక మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించి వార్తల్లోకెక్కాడు. నిజాయితీగా ట్యాక్స్‌ కట్టినందుకుగానూ ఆదాయపన్నుశాఖ ఆయనకు ప్రశంసాపత్రాన్ని సైతం అందించింది. అయితే అక్షయ్‌కు డబ్బుపిచ్చి ఉందన్న ప్రచారం జరిగింది. తాజాగా ద కపిల్‌ శర్మ షోకి హాజరైన అక్షయ్‌ మనీ మైండెడ్‌ అని తనపై పడిన ముద్రపై స్పందించాడు. 

రూ.100 కోట్లు ఎఫ్‌డీ చేస్తే..
హీరో మాట్లాడుతూ.. జితేంద్ర సాహెబ్‌ రూ.100 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకున్నాడని నేను ఎక్కడో వార్త చదివాను. నాకు బాగా గుర్తు.. అది చూశాక నేను మా నాన్న దగ్గరకు పరుగెత్తుకెళ్లాను. డాడీ, రూ.100 కోట్లు ఎఫ్‌డీ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది? అని అడిగాను. అప్పట్లో ఇంట్రెస్ట్‌ రేట్‌ 13% ఉండేది. ఈ లెక్కన నెలకు రూ.1.3 కోట్లు అన్నాడు. అంటే నేను రూ.100 కోట్లు ఎఫ్‌డీ చేసుకోగలిగితే నాకు ఆర్థిక స్వేచ్ఛ లభించినట్లే అని ఫీలయ్యాను. 

ఆశకు హద్దు లేదు
కానీ మనషుల ఆశకు అంతెక్కడిది? రూ.100 కోట్లు కాస్తా వెయ్యి కోట్లయితే బాగుండు.. వెయ్యెందుకు? రూ.2 వేల కోట్లయితే బాగుంటుంది అనుకునేవాడిని. అలా మనలో డబ్బు ఆశకు అంతం లేదు అన్నాడు. మరి ఇప్పటివరకు ఎంత ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశావు? అని కపిల్‌ అడగ్గా.. అది నేను చెప్పనుగా అని తప్పించుకున్నాడు అక్షయ్‌.

8 ఏళ్లుగా నేనే..
ఆప్‌కీ అదాలత్‌ షోకి వెళ్లినప్పుడు కూడా అక్షయ్‌కు డబ్బు గురించే ప్రశ్న ఎదురైంది. అందుకీ బాలీవుడ్‌ స్టార్‌.. నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను తప్ప ఎవరినీ దోపిడీ చేయడం లేదు కదా.. గత 8 ఏళ్లుగా ప్రభుత్వానికి నేనే ఎక్కువ ట్యాక్స్‌ కడుతున్నాను. అలా అని నేను మనీ మైండెడ్‌ అని అర్థం కాదు. బతకాలంటే డబ్బు అవసరం.

నేనేమైనా దొంగతనం చేస్తున్నానా?
నేను సంపాదిస్తున్నా.. ట్యాక్స్‌ కడుతున్నా, సేవ చేస్తున్నా.. సేవాగుణం నా మతం. అందరూ ఏమనుకుంటున్నారనేది నాకు అనవసరం. ఎవరైనా కార్యక్రమానికి రండి, డబ్బులిస్తాం అన్నారనుకోండి. తీసుకుంటే తప్పేంటి? మనమేం ఎవరి జేబులోనో చేయి పెట్టి దొంగిలించట్లేదు కదా! అని చెప్పుకొచ్చాడు. అక్షయ్‌ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ జానీ:LLB మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.50 కోట్లు దాటేసింది.

చదవండి: ఆ ఒక్క పని వల్లే మనీష్‌ ఎలిమినేట్‌! రెండువారాల్లో ఎంత సంపాదించాడంటే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)