Breaking News

డెలీవరీ బాయ్ vs హీరో.. కారుపై దాడి

Published on Wed, 07/01/2026 - 08:39

గతేడాది థియేటర్లలో రిలీజై ఆకట్టుకున్న 'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరోగా నటించి, పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన అఖిల్ రాజ్.. డెలివరీ బాయ్‌ని కొట్టడం, అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడం తెలిసిందే. అయితే తొలుత అందరూ హీరోని విమర్శించారు. కానీ తర్వాత అఖిల్ తన వెర్షన్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. తన తల్లిని తిట్టడం వల్లే డెలివరీ బాయ్‌ని కొట్టానని అన్నాడు. ఇది వివాదంగా మారడంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

(ఇదీ చదవండి: నిజమేంటో తెలుసుకోండి.. డెలివరీ బాయ్‌ వివాదంపై అఖిల్ రాజ్)

ఇక అఖిల్ రాజ్.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పలువురు డెలివరీ బాయ్స్ కూడా అక్కడికి చేరి ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మంగళవారం అఖిల్.. తన తల్లిదండ్రులతో కలిసి కారులో గుడికి వెళ్తుండగా కొండాపూర్‌లో డెలివరీ బాయ్ రమేశ్, తన అనుచరులతో కలిసి కారుని చుట్టుముట్టి రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. పోలీసులు అక్కడికి చేరుకుని డెలివరీ బాయ్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఇరువర్గాల వాదనలను విచారిస్తున్నారు.

(ఇదీ చదవండి: మహేశ్ బాబు.. మరో 80 రోజులు మాత్రమే)

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)