Breaking News

మరోసారి ప్రాణాపాయం నుంచి బయటపడ్డ అజిత్‌

Published on Mon, 02/10/2025 - 06:40

అజిత్‌ కథానాయకుడిగానే కాకుండా , కారు రేస్‌, రైఫిల్‌ షూటింగ్‌ క్రీడా రంగాల్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంటున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన విడాముయర్చి (పట్టుదల) చిత్రం ఇటీవల విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా అజిత్‌ కథానాయకుడిగా నటించిన మరో చిత్రం గుడ్‌ బాడ్‌ అగ్లీ. ఈ చిత్ర షూటింగ్‌ డబ్బింగును పూర్తి చేసిన అజిత్‌ ఇటీవల దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ కారు రేస్‌ క్రీడా పోటీల్లో పాల్గొని తృతీయ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. 

అయితే అంతకుముందు దుబాయ్‌లో జరిగిన కారు రేస్‌ శిక్షణలో పాల్గొని ప్రమాదానికి గురై తృటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు. అదేవిధంగా మరోసారి ఈయన కార్‌ రేస్‌ శిక్షణలో ఘోర ప్రమాదానికి గురై ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అజిత్‌ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరగనున్న కారు రేస్‌ పోటీలకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా అక్కడ శనివారం కారు రేస్‌ శిక్షణలో పాల్గొంటున్నారు. అయితే ఆయన నడుపుతున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ అజిత్‌కు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)