Hindupuram: జై బాలయ్య అంటూ.... టీడీపీ నాయకుల దాడి
Breaking News
పూల వ్యాపారే నిర్మాత.. ఆశ్చర్యపోయాను: అర్జున్
Published on Sat, 11/15/2025 - 07:07
యాక్షన్ కింగ్ అర్జున్, నటి ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh) కలిసి నటించిన చిత్రం ‘మఫ్టీ పోలీస్’ (Mufti Police). దినేశ్ లక్ష్మణన్ దర్శకత్వం వహించారు. తాజాగా ట్రైలర్ (Mufti Police Trailer)ను విడుదల చేశారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఈ నెల 21న రిలీజ్ కానుంది. జీఎస్ ఆర్ట్స్ పతాకంపై అరుళ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

ఈ చిత్ర నిర్మాత కోయంబత్తూర్‌కు చెందిన పూల వ్యాపారి కావడం విశేషం. ఈ మూవీలో నటించిన ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ ఒక యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర కథను దర్శకుడు చెప్పినప్పుడే తన ఒళ్లు జలదరించిందన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అవగాహన కలిగించేవిధంగా ఉంటుందన్నారు. ఇలాంటి యధార్థ సంఘటనతో చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు. నటుడు అర్జున్ నిజంగానే జెంటిల్‌మెన్ అని పేర్కొన్నారు. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఈ చిత్రంలో తాను రెండు ఫైట్స్‌లో నటించినట్లు చెప్పారు.

నటుడు అర్జున్ మాట్లాడుతూ ఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైనదని అన్నారు. ఈ చిత్ర నిర్మాత పూల వ్యాపారినని చెప్పారని తెలిసి తాను ఆశ్చర్యపోయానన్నారు, అయితే ఆయనకు సినిమాపై ఉన్న ప్రేమే నిర్మాతగా చేసిందని తెలిపారు. అందరినీ గౌరవించే ఆయన మనస్తత్వం తనకు బాగా నచ్చిందని అర్జున్ పేర్కొన్నారు. ఆయన మంచి మనసు కోసమే ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలన్నారు. చిత్ర నిర్మాత అరుళ్ కుమార్ మాట్లాడుతూ తనకు ఒప్పందం చేసిన అందరూ ఈ చిత్రం కోసం ఎంతగానో శ్రమించారన్నారు. తాను నటుడు అర్జున్ వీరాభిమానినని, ఆయన నటించిన జెంటిల్‌మెన్ చిత్రం చూసి అభిమానినయ్యానని చెప్పారు. అలాంటిది అర్జున్ హీరోగా చిత్రం చేయడం సంతోషకరం అన్నారు.
Tags : 1