Breaking News

వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్‌ బచ్చన్‌

Published on Thu, 06/19/2025 - 08:43

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్( Abhishek Bachchan) నటించిన కొత్త సినిమా హౌస్‌ఫుల్ 5 కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ఆయన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను పొందుతోంది. ఇంతలో, ఆయన సోషల్ మీడియాలో ఒక  పోస్ట్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది. ప్రియమైన వారికోసం అన్నీ ఇచ్చేశానంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో కుటుంబ సమస్యల వల్ల ఆయన ఇలాంటి పోస్ట్‌ చేశారా అంటూ నెటిజన్లు సందేహిస్తున్నారు. కొంతకాలంగా నటి ఐశ్వర్యరాయ్‌( Aishwarya Rai)-  అభిషేక్ బచ్చన్‌ల విడాకుల వార్తలు వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయన చేసిన పోస్ట్‌ మరింత బలాన్ని ఇచ్చేలా ఉంది.

అభిషేక్‌ బచ్చన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రోజువారీ జీవితంలో ఎదురయ్యే బాధ్యతల మీద మాత్రమే దృష్టి పెట్టడం కంటే, అంతర్గత ఆనందం గురించి ఆలోచించడం ఎంత కీలకమో ఆయన నొక్కి చెప్పారు. ' నేను మరోసారి ఒంటిరిగా ఉండాలని ఉంది. నా కోసం నేను కొంత సమయం కేటాయించుకోవాలనిపిస్తుంది. ఈ జనసమూహం నుంచి దూరంగా ఉంటూ నన్ను నేను వెతుక్కోవాలనుకుంటున్నాను. నా ప్రియమైన వారికోసం అన్నీ ఇచ్చేశాను. ఇప్పుడు నాకూ కొంత సమయం కావాలి. నా గురించి నేను తెలుసుకునేందుకు ఒంటరిగా ఉండాలని ఉంది.' అంటూ హిందీలో రాసుకొచ్చారు.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలు ఉన్నాయి: పురందేశ్వరి)

నెటిజన్లు అభిషేక్‌ బచ్చన్‌ పోస్ట్‌పై ఇలా కామెంట్లు చేస్తున్నారు. మిస్ ఇండియాను వివాహం చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి సంతోషంగా లేడు అంటే ఏమిటి..? సంతోషానికి కొలమానం ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరొక వ్యక్తి సలహా ఇచ్చాడు- 'సార్, మీ భార్య, పిల్లలతో కొంత సమయం గడపండి, మీరు మంచిగా రీసెట్‌ అవుతారు.' అంటూ పేర్కొన్నాడు.

సుమారు 17 ఏళ్ల క్రితం అభిషేక్‌ - ఐశ్వర్యలకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరికి ఆరాధ్య(15) అనే కుమార్తె ఉంది. ఈ జంట విడాకులు తీసుకోనున్నారంటూ గత కొంతకాలంగా పలు కథనాలు వైరల్‌ అయ్యాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని వీరిద్దరూ ఇప్పటికే  పరోక్షంగా స్పందించారు. అయినప్పటికీ ఆ వార్తల ప్రచారం ఆగలేదు. ఇప్పుడు అభిషేక్‌ షేర్‌ చేసిన పోస్ట్‌తో మరోసారి విడాకుల అంశం తెరపైకి వచ్చింది.
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)