Breaking News

27 ఏళ్లుగా నాతో ఉన్నావ్‌.. నీ కాళ్లకు మొక్కిన తర్వాతే ఏదైనా..

Published on Mon, 11/10/2025 - 15:10

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ తనయుడు, హీరో అభిషేక్‌ బచ్చన్‌ (Abhishek Bachchan) భావోద్వేగానికి లోనయ్యాడు. తన దగ్గర 27 ఏళ్లుగా పని చేస్తున్న మేకప్‌ ఆర్టిస్టు అశోక్‌ చనిపోయాడంటూ సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టాడు. అతడితో కలిసి దిగిన ఫోటోను సైతం జత చేశాడు. 'అశోక్‌ దాదా.. నా దగ్గర 27 ఏళ్లుగా పని చేస్తున్నాడు. నా ఫస్ట్‌ సినిమా నుంచి అతడే నాకు మేకప్‌ వేస్తున్నాడు. అతడు కేవలం నా టీమ్‌లో ఒక వ్యక్తి మాత్రమే కాదు, నా కుటుంబసభ్యుడు కూడా! 

ఆయన లేకుండా షూటింగ్‌కు వెళ్లలేదు
అతడి అన్న దీపక్‌.. మా నాన్న దగ్గర దాదాపు 50 ఏళ్లుగా మేకప్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లుగా తన ఆరోగ్యం బాగుండటం లేదు. దానివల్ల కొన్నిసార్లు నాతోపాటు సెట్‌కు రావడం లేదు. కానీ నాకు మంచిగా మేకప్‌ వేయమని తన అసిస్టెంట్‌కు మరీమరీ చెప్పేవాడు. అంతకుముందు వరకు ఆయన లేకుండా నేను షూటింగ్‌కు వెళ్లిందే లేదు. చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేవాడు. కనిపించిన వెంటనే ఆలింగనం చేసుకునేవాడు. బ్యాగ్‌లో తినడానికి ఏదో ఒకటి తెచ్చుకునేవాడు.

ఆయన పాదాలకు నమస్కరించాకే..
నేను ఏదైనా సినిమా ఒప్పుకున్నప్పుడు మొదట ఈయన కాళ్లకు నమస్కరించిన తర్వాతే కెమెరా ముందుకు వెళ్తాను. అలా ప్రతి సినిమాకు ఆయన ఆశీర్వాదం తీసుకుంటాను. ఇప్పటినుంచి తన కోసం ఆకాశంవైపు చూస్తాను.. స్వర్గంలో ఉన్న ఆయన నన్ను కచ్చితంగా దీవిస్తాడు. నీ ప్రేమాభిమానాలకు, కేరింగ్‌కు, టాలెంట్‌కు.. అన్నింటికీ థాంక్యూ దాదా. నువ్వు నాతో లేవంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇకపై నువ్వు లేకుండానే సెట్‌కు వెళ్లాలని తల్చుకుంటేనే మనసు ముక్కలవుతోంది. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా..' అంటూ అభిషేక్‌ బచ్చన్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.

 

 

చదవండి: మరణాన్ని ముందే ఊహించిన హీరో..

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)