Breaking News

దుస్తులు ఫ్రీగా ఇచ్చేవారు కాదు, కొనుక్కునే స్థోమత లేక..

Published on Tue, 12/26/2023 - 16:11

సంతోషమైనా, దుఃఖమైనా ఏదీ కలకాలం ఉండదు. పగలూరేయిలా ఒకదాని తర్వాత మరొకటి వస్తూ పోతూనే ఉంటాయి. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ జీవితంలోనూ ఇదే జరిగింది. స్టార్‌ అన్న బిరుదు సంపాదించడానికి ముందు ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. ఒకానొక సమయంలో సంపాదించినదంతా పోగొట్టుకుని ఉట్టి చేతులతో నిలబడ్డాడు. కానీ గోడకు కొట్టిన బంతిలా మెరుపు వేగంతో మళ్లీ సంపాదించి నిలదొక్కుకున్నాడు. తాజాగా ఆనాటి గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు బిగ్‌బీ తనయుడు, నటుడు అభిషేక్‌ బచ్చన్‌.

సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలే
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కెరీర్‌ తొలినాళ్లలో బాలీవుడ్‌లో చాలా కష్టపడ్డాను. నటుడిని అవ్వాలన్న కోరిక నాలో బలంగా ఉండేది. కానీ రెండేళ్లపాటు చాలామంది డైరెక్టర్లు నాతో సినిమా చేయడానికి వెనుకడుగు వేశారు. అదే సమయంలో నాన్న(అమితాబ్‌ బచ్చన్‌) ఓ బిజినెస్‌ ప్రారంభించి ఉన్నదంతా పోగొట్టుకోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. నేను, నా స్నేహితుడు కలిసి సొంతంగా కథ రాసుకోవాలనుకున్నాం.. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు.

దీన పరిస్థితి..
ఒకరోజు నాన్న.. ఫిలింఫేర్‌ అవార్డు కార్యక్రమానికి రమ్మన్నాడు. ఈవెంట్‌కు ఎలా రెడీ అయి వెళ్లాలని అందరూ కొన్ని నెలల ముందే ప్రిపేర్‌ అవుతుంటారు. పైగా 20 ఏళ్ల క్రితం ఎవరూ ఉచితంగా దుస్తులు ఇచ్చేవారు కాదు. కొనుక్కున్న వాటినే వేసుకుని వెళ్లాలి. సాయంత్రం షూటింగ్‌ లాంటివి పెట్టుకోకుండా ఇండస్ట్రీ అంతా సమయానికి అక్కడికి చేరుకుంటుంది. నేనేమో ఫంక్షన్‌కు ఏం వేసుకోవాలి? అని నాన్నను అడిగాను. ఇప్పుడిది మీకు విచిత్రంగా అనిపించవచ్చేమో కానీ ఆ సమయంలో మాత్రం పరిస్థితి అంత దారుణంగా ఉంది. నా దగ్గర సరైన బట్టలు లేవు.

కొనుక్కునే స్థోమత లేదు
ఆర్థిక కష్టాల వల్ల కొనుక్కునేంత స్థోమత కూడా లేకపోయింది. ఫార్మల్‌ డ్రెస్‌ లేదు, జీన్స్‌-టీషర్ట్‌ వేసుకుని వెళ్తే బాగోదు. మా సోదరి పెళ్లికి కొన్నేళ్ల క్రితం కొనుక్కున్న డ్రెస్‌ ఉంటే అదే వేసుకెళ్లాను' అని చెప్పుకొచ్చాడు అభిషేక్‌. కాగా ఈ ఫంక్షన్‌లో బార్డర్‌ సినిమాకుగానూ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న జేపీ దత్తా.. అభిషేక్‌ను చూసి తనతో సినిమా తీయాలనుకున్నాడు. రిఫ్యూజీ మూవీతో అభిషేక్‌ను వెండితెరకు హీరోగా పరిచయం చేశాడు. స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌కు సైతం ఇదే తొలి సినిమా! అభిషేక్‌ చివరగా ఘూమర్‌ సినిమాలో కనిపించాడు.

చదవండి: కొత్త వ్యాపారం మొదలుపెట్టిన మనోజ్‌- మౌనిక.. దేశం నలుమూలలా తిరిగి..

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)