Breaking News

అభిషేక్ - ఐశ్వర్యపై విడాకుల రూమర్స్.. ఇకపై తెరపడినట్లే!

Published on Tue, 03/04/2025 - 19:24

బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్యరాయ్, అభిషేక్‌ బచ్చన్‌పై గత కొన్ని నెలలుగా విడాకుల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అనిల్ అంబానీ కుమారుడి పెళ్లి సమయంలోనూ వీరిద్దరు విడిపోనున్నారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ బర్త్‌ డే రోజు ఆలస్యంగా విషెస్ చెప్పడంతో మరోసారి  డివోర్స్ వార్తలు వినిపించాయి. అలా ఏదో ఒక సందర్భంలో వీరిద్దరిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

విడాకుల వార్తల నేపథ్యంలో స్టార్ కపుల్ బాలీవుడ్‌ డైరెక్టర్ కుమారుడి పెళ్లిలో సందడి చేశారు. దర్శకుడు  అశుతోష్ గోవారికర్ కుమారుడి పెళ్లిలో జంటగా కనిపించారు. చాలా రోజుల తర్వాత ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ఓ శుభ కార్యానికి హాజరు కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి నుంచైనా విడాకుల వార్తలకు చెక్ పెట్టినట్లు పడుతుందని భావిస్తున్నారు. ఐశ్వర్య, అభిషేక్ పెళ్లికి హాజరైన ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ పెళ్లికి అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, కిరణ్ రావ్, గాయత్రీ ఒబెరాయ్, జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్‌ముఖ్, విద్యా బాలన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ లాంటి సినీతారలు హాజరయ్యారు. అశుతోష్ కుమారుడు కోణార్క్ మార్చి 2న నియతిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

అభిషేక్-ఐశ్వర్యల పెళ్లి 2007లో జరిగింది. వీరిద్దరికి   2011లో ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె జన్మించారు. జూలై 2024లో అనంత్ అంబానీ పెళ్లి నుంచి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌పై విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా ఈ జంట పెళ్లికి హాజరవ్వడంతో ఆ వార్తలకు దాదాపు చెక్ పడినట్లే.
 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)