Breaking News

హీరోగా టూరిస్ట్‌ ఫ్యామిలీ డైరెక్టర్‌.. తొలి ప్రాధాన్యత దానికే!

Published on Sun, 11/02/2025 - 08:57

సీనియర్లు, జూనియర్లు, కొత్త దర్శకులు ఎవరైనాగానీ కంటెంట్‌ కొత్తగా ఉంటేనే వారి చిత్రాలు సక్సెస్‌ సాధిస్తాయి. ఇందుకు ఉదాహరణ టూరిస్ట్‌ ఫ్యామిలీ చిత్రం. ఈ చిత్రం ద్వారా అభిషన్‌ జీవింత్‌ (Abishan Jeevinth) దర్శకుడుగా పరిచయమయ్యారు. అంతేకాకుండా కీలకపాత్రను పోషించారు. ఈయనకు ఎలాంటి దర్శకత్వం అనుభవం లేదన్నది గమనార్హం. అయినప్పటికీ టూరిస్ట్‌ ఫ్యామిలీ అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. 

హీరోగా సినిమా
తాజాగా అభిషన్‌ జీవింత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్ర షూటింగ్‌ కూడా పూర్తి అయింది. దీనికి ఆయన శిష్యుడు మదన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే దర్శక, నటుడు అభిషన్‌ జీవింత్‌ తాజాగా ఓ ఇంటివాడయ్యారు. స్నేహితురాలు అఖిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం శుక్రవారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈసందర్భంగా శనివారం ఉదయం ఈ నూతన దంపతులు చెన్నైలో మీడియాను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. 

డైరెక్షన్‌కే ప్రాధాన్యత
అనంతరం అభిషన్‌ జీవింత్‌ మీడియాతో ముచ్చటిస్తూ తాను దర్శకత్వం వహించిన టూరిస్ట్‌ ఫ్యామిలీ చిత్రాన్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న చిత్ర షూటింగ్‌ పూర్తి అయిందని త్వరలోనే దానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. అయితే తనకు తగిన కథ లభిస్తేనే నటిస్తానని, తాను దర్శకత్వానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. త్వరలోనే తాను దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని అభిషన్‌ జీవింత్‌ తెలిపారు.

చదవండి: ఒకప్పుడు హిట్‌ డైరెక్టర్స్‌.. కొత్త కబురెప్పుడు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)