ఇడియట్స్‌ మళ్లీ కలిస్తే?

Published on Tue, 12/09/2025 - 00:58

ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘3 ఇడియట్స్‌’ మూవీ సీక్వెల్‌కి సన్నాహాలు మొదలయ్యాయని బాలీవుడ్‌ టాక్‌. రాజ్‌కుమార్‌ హిరాణి దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్  హీరోగా, ఆర్‌. మాధవన్ , శర్మన్  జోషి, కరీనా కపూర్, బొమన్  ఇరానీ ప్రధానపాత్రల్లో నటించిన హిందీ సినిమా ‘3 ఇడియట్స్‌’. విధు వినోద్‌ చోప్రా నిర్మించిన ఈ చిత్రం 2009లో విడుదలై, బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.

‘3 ఇడియట్స్‌’ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించే పనిలో ఉన్నారట రాజ్‌కుమార్‌ హిరాణి. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందని, కథ పూర్తయిన తర్వాత ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రావొచ్చనే టాక్‌ బాలీవుడ్‌లో తెరపైకి వచ్చింది. ‘3 ఇడియట్స్‌’ చిత్రం తొలిపార్టులో నటించిన ప్రధాన తారాగణ మంతా సీక్వెల్‌లోనూ నటిస్తారట. అంతేకాదు.. ఈ సినిమాలోని ప్రధానపాత్రధారులు 15 సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుంది? అనే కోణంలో  ‘3 ఇడియట్స్‌’ కథనం సాగుతుందని బాలీవుడ్‌ భోగట్టా.

ఈ సంగతి ఇలా ఉంచితే.. ఆమిర్‌ఖాన్ , రాజ్‌కుమార్‌ హిరాణి కాంబినేషన్ లో ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ బయోపిక్‌ రానుందని ఓ ప్రకటన వచ్చింది. మరి.. ‘3 ఇడియట్స్‌’ సీక్వెల్‌ ముందు సెట్స్‌కి వెళుతుందా? లేక దాదా సాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ మొదలవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)