మాజీ భార్యతో జతకట్టిన అమిర్‌ ఖాన్.. దాదాపు 12 ఏళ్ల తర్వాత!

Published on Thu, 09/07/2023 - 19:50

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్‌ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఆయన నటించిన లాల్ సింగ్ చద్దా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. అయితే తాజాగా ఆయన ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో కిరణ్ రావు దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రానికి లాపాటా లేడీస్ అనే టైటిల్‌ ఫిక్స్ చేయగా... దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఆమె దర్శకురాలిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ధోబీ ఘాట్ తర్వాత మరోసారి అమిర్ ఖాన్ తన మాజీ భార్యతో జతకట్టడంపై బాలీవుడ్‌లో తెగ వైరలవుతోంది.

(ఇది చదవండి: ప్రభాస్ కల్కిలో టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్స్.. ఇప్పటికే!)

కాగా.. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లపాటా లేడీస్‌ అనే చిత్రాన్ని ఇద్దరు నవ వధువుల మిస్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. 2001లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని అమిర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం జనవరి 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. కిరణ్ రావు, అమిర్ ఖాన్ 2005లో వివాహం చేసుకున్నారు. దాదాపు 16 ఏళ్ల వీరి బంధానికి 2021లో ముగింపు పలికారు. 

(ఇది చదవండి: బాహుబలి తర్వాత అందుకే చేయలేదు: అనుష్క శెట్టి ఆసక్తికర కామెంట్స్!)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)