సినిమాలు చూసే అలవాటు లేదు.. ఇంట్లో ఒప్పుకోరు!: ఆమిర్‌ ఖాన్‌

Published on Mon, 03/30/2026 - 10:45

తాను పెద్దగా సినిమాలు చూడనంటున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌. చిన్నప్పుడు చేతికి పుస్తకాలిచ్చేవారే తప్ప సినిమాలు చూసేందుకు అనుమతిచ్చేవారు కాదని, దాంతో అదే అలవాటైపోయిందని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. నేను చాలా సాంప్రదాయ కుటుంబంలో పెరిగాను. మా అమ్మానాన్న చాలా స్ట్రిక్ట్‌.. సినిమాలు చూసేందుకు అంతగా అనుమతిచ్చేవారు కాదు. 

అమ్మ అనుమతితోనే..
దాంతో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడిని. కేవలం దూరదర్శన్‌లో వచ్చిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలు, మరీ పాత సినిమాలు మాత్రమే చూశాను. ఎప్పుడైనా సినిమా చూడాలనుకుంటే మా అమ్మను అనుమతి అడిగేవాడిని. తను ఓకే చెప్తేనే చూసేదాన్ని, లేదంటే లేదు. అయితే రొమాంటిక్‌ సినిమాలు చూడటం మాత్రం నిషిద్ధం. కేవలం వారాంతాల్లో మూవీస్‌ చూసేవాడిని.

సినిమాలు చూడను
అయితే విచిత్రంగా 18 ఏళ్లకే నేను సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అసిస్టెంట్‌గా కెరీర్‌ ప్రారంభించి తర్వాత హీరోగా మారాను. అయితే ఇప్పటికీ నేను పెద్దగా సినిమాలు చూడను. ఫన్నీగా చెప్పాలంటే.. కొందరికి ఫుట్‌బాల్‌ ఆడటం ఇష్టం, మరికొందరికి చూడటం ఇష్టం. అలా నేను సినిమాలు చేస్తాను, కానీ చూడను. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన సినిమాలేవీ చూడలేదు. నా ప్రపంచంలో నేను బతికేస్తుంటాను అని చెప్పుకొచ్చాడు.

సినిమా
ఇకపోతే ఆమిర్‌ చివరగా సితారే జమీన్‌ పర్‌ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం నిర్మాతగా ఏక్‌ దిన్‌, లాహోర్‌ 1947 అని రెండు సినిమాలు చేస్తున్నాడు. ఏక్‌ దిన్‌లో.. ఆమిర్‌ ఖాన్‌ కుమారుడు జునైద్‌ ఖాన్‌ హీరోగా నటించగా సాయిపల్లవి కథానాయికగా కనిపించనుంది. ఇది వన్‌ డే అనే థాయ్‌ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. ఏక్‌ దిన్‌ మే 1న విడుదల కానుంది.

చదవండి: ధురంధర్‌ రికార్డు బ్రేక్‌ చేసిన ధురంధర్‌ 2

Videos

క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు

బస్సు ప్రమాద బాధితులకు మేకపాటి సాయం

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు లేరు..

కుర్రాడు మంచోడే కానీ... ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ పెట్టాడు..!

అంతా ఫిబ్రవరి 26 తర్వాతే ఇప్పుడు దుబాయ్ ఎలా ఉందంటే?

దళిత ఉద్యోగిపై బూతులు.. పిఠాపురం కమీషనర్ ఆడియో లీక్

SIP లో నెలకు ఎంత పెట్టుబడి పెడితే 5 కోట్లు సంపాందించొచ్చు..!

పందిలా ఒళ్ళు బలిసి... దవడ పగిలిపోద్ది.. జనసేన సుభాషిణిని రఫ్ఫాడించిన నేత

ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు

భారీగా పడిపోయిన బంగారం ధరలు! కొనుగోలుదారులకు పండగ..

Photos

+5

ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)

+5

గ్రీన్‌ అవుట్‌ఫిట్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫొటోలు)

+5

హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి, శాసన సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)