Breaking News

60 ఏళ్ల స్టార్‌ హీరోతో ప్రేమాయణం.. అందుకే ప్రేమించానన్న ప్రియురాలు

Published on Mon, 03/17/2025 - 14:03

ప్రేమ ఎప్పుడు? ఎక్కడ? ఎలా? చిగురిస్తుందో తెలియదంటారు. ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) విషయంలోనూ ఇదే జరిగింది. 25 ఏళ్లుగా పరిచయస్తురాలైన గౌరీ స్ప్రాట్‌ (Gauri Spratt)తో ప్రేమలో పడతానని కలలో కూడా ఊహించకపోవచ్చు. కానీ ఏమైంది? రెండేళ్లక్రితం మనసు మాట వినలేదు. గౌరీ గురించే పరితపించసాగింది. ఇది స్నేహం కాదు ప్రేమ అని ఆమిర్‌కు అర్థమయ్యింది. అదే మాట ఆమెతో చెప్పగా తను కూడా సంతోషంగా ఒప్పుకుంది.

60 ఏళ్ల హీరోతో ప్రేమ..
అయితే ఆమిర్‌ ఖాన్‌ ఈ ఏడాది 60వ వయసులోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని వారికి విడాకులిచ్చేశాడు. మరి అంతటి పెద్దాయనను ఈవిడ ఎలా ప్రేమించింది? అని సోషల్‌ మీడియాలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అనుమానాలకు చెక్‌ పెట్టింది గౌరి. ఆమిర్‌ను జీవిత భాగస్వామిగా ఎంచుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. 

ప్రేమకు కారణం అదా!
నా లైఫ్‌లో ఒక జెంటిల్‌మన్‌ ఉండాలనుకున్నాను. ఎక్కడలేని ప్రేమ కురిపించడంతోపాటు.. దయాగుణం కలిగుండే వ్యక్తి నా జీవితంలోకి వస్తే బాగుండనుకున్నాను అని గౌరి చెప్పింది. ఇంతలో ఆమిర్‌ అందుకుంటూ.. అప్పుడు నేను నీకు కనిపించాను కదూ.. అంటూ సరదాగా బదులిచ్చాడు. గౌరీ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు. తను పెరిగిందంతా బెంగళూరులోనే కాదు. పెద్దగా హిందీ సినిమాలు కూడా చూడదట! 

గౌరీకి ఆరేళ్ల కుమారుడు
నన్ను సూపర్‌స్టార్‌గా చూడదు కానీ పార్ట్‌నర్‌గా మాత్రం భావిస్తోందని ఆమిర్‌ స్వయంగా పేర్కొన్నాడు. మార్చి 12న ఆమెను తన స్నేహితులు సల్మాన్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌కు పరిచయం చేశాడు. ఇకపోతే గౌరీకి గతంలో పెళ్లయినట్లు తెలుస్తోంది. ఆమెకు ఆరేళ్ల కుమారుడు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. తను ముంబైలో బిబ్లంట్‌ అనే సెలూన్‌ నడుపుతోంది.

చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్‌ ఫైర్‌

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)