Breaking News

'మీరు తప్పకుండా మా సలహా పాటించండి'.. స్టార్ హీరో విజ్ఞప్తి!

Published on Tue, 10/10/2023 - 19:14

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. దంగల్ సినిమాతో దక్షిణాదిలోనూ మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో సినిమాలతో బిజీగా అన్న హీరో.. తాజాగా  తన కూతురు ఐరా ఖాన్‌తో కలిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు సలహాలు ఇచ్చారు. ఎవరైనా సరే మానసిక ఆరోగ్య సమస్యలను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. అంతేకాకుండా మెరుగైన సలహాల కోసం నిపుణులను సంప్రదించమని విజ్ఞప్తి చేశారు.  కాగా.. అమీర్ ఖాన్ కుమార్తె ఇరా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది.

అమీర్ ఖాన్ మాట్లాడుతూ..' వైద్యుడైనా, ఉపాధ్యాయుడు, వడ్రంగి అయినా రంగాల్లో నైపుణ్యం ఉన్న వారి సహాయం కోసం మనం వెళ్లాల్సిందే. ఈ ప్రపంచంలో మనం చేయలేని పనులు ఎన్నో ఉన్నాయి. వాటికి నిపుణుల సహాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అలాదే ప్రతి మనిషి తమ మానసిక పరిస్థితి బాగా లేకపోతే చికిత్స తీసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో సిగ్గపడొద్దు. మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం పొందండి. గతంలో నా కుమార్తె ఇరా, నేను ఇలాంటి సమస్య ఎదుర్కొన్నాం. అందుకే చికిత్స తీసుకున్నాం. మీరు కూడా తప్పకుండా నా సలహా పాటిస్తారని నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్' అని అన్నారు. 

కాగా.. ఐరా ఖాన్ కొన్నేళ్ల క్రితమే ఆమె అగాట్సు అనే ఫౌండేషన్‌ను స్థాపించింది.  దీని ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు  అవగాహన కార్యక్రమాలు, శిక్షణను పెంపొందించడం ఐరా ఖాన్ లక్ష్యంగా పెట్టుకుంది. 2021లో ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు ఇరా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇరా గతంలో డిప్రెషన్‌తో తన బాధపడినట్లు తన అనుభవాన్ని పంచుకుంది. అగట్సు ఫౌండేషన్‌ ద్వారా ముఖ్యంగా  కష్ట సమయాల్లో అవసరమైన వారికి సహాయం చేయడమే లక్ష్యమని ఐరా చెబుతోంది. కాగా..  అమీర్ ప్రస్తుతం లాపటా లేడీస్, లాహోర్ 1947 చిత్రాలను నిర్మిస్తున్నారు. 


  

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు