Breaking News

ప్రియురాలితో కలిసి బోనీకపూర్ ఇంటికి అమిర్ ఖాన్!

Published on Sun, 05/04/2025 - 13:00

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ముంబయి చేరుకున్నారు. ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను పరామర్శించారు. రెండు రోజుల క్రితమే బోనీ కపూర్ తల్లి నిర్మల్ కపూర్‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బోనీ కపూర్‌ను కలిసి పరామర్శించారు. అమిర్‌తో పాటు ఆయన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి బోనీ కపూర్ నివాసానికి చేరుకుని ఆమెకు నివాళులర్పించారు.

కాగా.. బోనీ కపూర్ మాతృమూర్తి నిర్మల్ కపూర్ మే 2న అనారోగ్యంతో మరణించారు. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.  ఆ తర్వాత ఎస్వీ రోడ్‌లోని విలే పార్లే శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బోనీ కపూర్ కుటుంబంతో సాన్నిహిత్య కారణంతో  ఆమిర్ ఖాన్ ప్రత్యేకంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వీరితో పాటు కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, రాణి ముఖర్జీ లాంటి ప్రముఖులు కూడా బోనీ నివాసంలో కనిపించారు.
 

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)