Breaking News

సాంగ్‌ షూటింగ్‌.. నా కళ్లముందే మంటల్లో కాలిపోయాడు: ఆమని

Published on Mon, 02/20/2023 - 21:22

అమ్మదొంగ, మిస్టర్‌ పెళ్లాం, శుభలగ్నం వంటి ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించింది ఆమని. ఒకప్పుడు హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం హీరోహీరోయిన్ల తల్లి, అత్త పాత్రల్లో నటిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కళ్లముందు జరిగిన ఘోరాన్ని చెప్పుకొచ్చింది. 'నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది. కెమెరామన్‌ లోక్‌ సింగ్‌ గారు నా కళ్లముందే మంటల్లో కాలిపోయారు. ఆ రోజు జూబ్లీహిల్స్‌లో ఓ పాట షూట్‌ చేస్తున్నారు. పెద్ద పెద్ద బండలపై పెట్రోల్‌ పోశారు. ఆ మంటల మధ్యలో మేము డ్యాన్స్‌ చేస్తున్నాం. లోక్‌నాధ్‌గారు పైన క్రేన్‌లో ఉన్నారు. ఫస్ట్‌ టేక్‌ ఓకే అయింది.

కానీ ఆయనకు మంటలు ఇంకాస్త ఎక్కువుండాలంటూ వన్‌ మోర్‌ అన్నాడు. అప్పుడు చలికాలం కావడంతో మేము దుప్పటి పట్టుకుని ఓ పక్కన కూర్చున్నాం. తిరిగి లొకేషన్‌లో మంటలు అంటిస్తున్నారు. ఆ క్రేన్‌లో ఉన్న వ్యక్తి కిందకు దిగి వచ్చి మీరు సరిగా పెట్రోల్‌ పోయడం లేదంటూ చెంబు అందుకున్నాడు. ఓ బండపైన పెట్రోల్‌ పోశాడు. అంతే ఆ పక్కనున్న ఫైర్‌ ఒక్కసారిగా లేచి ఈయనకు కూడా మంటలంటుకున్నాయి. మా కళ్ల ముందే ఆయన నిలువునా కాలిపోయాడు. మరణం ఆయన్ను పిలిచింది. లేదంటే ఎక్కడో కూర్చున్న వ్యక్తి పెట్రోల్‌ పోయడమేంటి? అది అంటుకోవడమేంటి? చాలా భయంకరమైన మరణమిది' అని గుర్తు చేసుకుంది ఆమని.

చదవండి: ఆ ఒక్క సినిమా వల్ల నేను హీరోయిన్‌ కాలేకపోయా

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)