అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!
Breaking News
ఆకాశమే నీ హద్దు.. పైకి మాత్రమే చూడు!
Published on Sat, 10/17/2026 - 15:24
పేరుకే మలయాళ హీరో గానీ దుల్కర్ సల్మాన్.. తెలుగులోనూ బోలెడంతమంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. మహానటి, సీతారామం తదితర చిత్రాలు ఇతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఇతడు పలు తెలుగు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి 'ఆకాశంలో ఒక తార'. వచ్చే నెల 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ వదిలారు.
(ఇదీ చదవండి: వీకెండ్ ధమాకా.. ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)
ఓ పల్లెటూరిలో ఉండే ఓ సాధారణ అమ్మాయి.. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగామి ఎలా అయింది? ఈ క్రమంలో ఎలాంటి అడ్డంకుల్ని అధిగమించింది? ఈమెకు సాయపడే విషయంలో హీరో ఎలాంటి పాత్ర పోషించాడు? అనేది స్టోరీలా అనిపిస్తోంది. టీజర్ అయితే అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో బాగుంది. డైలాగ్స్ కూడా స్టోరీకి తగ్గట్టు ఉన్నాయి.
పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాతో సాత్విక వీరవల్లి అనే తెలుగమ్మాయి హీరోయిన్గా పరిచయమవుతోంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.
(ఇదీ చదవండి: అత్తామామలతో అనిరుధ్.. ప్రముఖులకు పెళ్లికి ఆహ్వానం!)
Tags : 1