సంక్రాంతి కానుకగా శంబాల.. ట్రైలర్‌ రిలీజ్

Published on Sun, 01/04/2026 - 13:45

ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన  మైథలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ శంబాల. యుగంధర్‌ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహిధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మించారు. ఈ మూవీ క్రిస్‌మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రావడంతో వసూళ్లపరంగానూ దూసుకెళ్తోంది. ఈ మూవీతో చాలా రోజుల తర్వాత ఆది సాయికుమార్ ఖాతాలో హిట్‌ పడింది.

తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని నార్త్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హిందీలో డబ్‌ చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిందీ ట్రైలర్‌ విడుదల చేశారు. కన్నడ హీరో రిషబ్ శెట్టి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శంబాల టీమ్‌కు రిషబ్ శెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూవీ జనవరి 09న బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది.

కాగా.. ఈ చిత్రంలో అర్చన్‌ అయ్యర్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీకి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించాడు.  కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)