Breaking News

హిందీ రిలీజ్‌ గురించి అడుగుతున్నారు: హీరో ఆది సాయికుమార్‌

Published on Wed, 11/05/2025 - 01:58

‘‘సినిమాలోని కంటెంట్‌ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారు. డిఫరెంట్‌ కంటెంట్‌ ఉన్న మా ‘శంబాల’ ఏ ఒక్కరినీ నిరాశపరచదు. మా చిత్రాన్ని ప్రేక్షకులు సపోర్ట్‌ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ఆది సాయికుమార్‌ అన్నారు. ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘శంబాల: ఏ మిస్టికల్‌ వరల్డ్‌’. అర్చన అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. యుగంధర్‌ ముని దర్శకత్వంలో రాజశేఖర్‌ అన్నభీమోజు, మహీధర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న రిలీజ్‌ కానుంది.

ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు మేకర్స్‌. ట్రైలర్‌కు మంచి స్పందన లభించిందని చిత్రబృందం పేర్కొంది. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ– ‘‘మా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన ప్రభాస్‌గారికి థ్యాంక్స్‌. ఈ ట్రైలర్‌ చూసి, రానాగారు మెచ్చుకుని, తన వంతుగా సాయం చేస్తానని చెప్పారు. కొంతమంది హిందీ రిలీజ్‌ గురించి అడుగుతున్నారు.

ఇంకా మాకు సపోర్ట్‌గా నిలిచిన దుల్కర్, సందీప్‌ కిషన్, కిరణ్‌ అబ్బవరం, సహకరించిన నిర్మాతలు వంశీ, ప్రమోద్, ప్రసాద్‌ అన్నలకు ధన్యవాదాలు. రాజీపడకుండా నిర్మించిన నిర్మాతలకు లాభాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన చిత్రమిది’’ అని యుగంధర్‌ ముని చెప్పారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)