Breaking News

హారర్‌ చిత్రానికీ కన్నీళ్లొస్తాయనుకోలేదు: నాని

Published on Sun, 02/23/2025 - 01:45

‘‘శబ్దం’ సినిమాని ఎంజాయ్‌ చేశాను. ఎమోషనల్‌గా చాలా హై ఇస్తుంది. హారర్‌ సినిమాకీ కన్నీళ్లొస్తాయని  ఎప్పుడూ అనుకోలేదు. మంచి కథ, భావోద్వేగాలున్న హారర్‌ సినిమా ఇది. హారర్‌ మూవీస్‌ని ఇష్టపడే వారైతే పది మంది ఫ్రెండ్స్‌తో కలసి వెళ్లండి... చాలా ఎంజాయ్‌ చేస్తారు’’ అని హీరో నాని తెలిపారు. ఆది పినిశెట్టి హీరోగా అరివళగన్‌ దర్శకత్వం వహించిన తెలుగు–తమిళ చిత్రం ‘శబ్దం’. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

శివ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఎన్‌ సినిమాస్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో, మైత్రీ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా నైజాంలో రిలీజవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘నిన్ను కోరి’ సినిమా నుంచి ఆది, నేను ఫ్రెండ్స్‌. ‘శబ్దం’ సినిమాపై తను ఎందుకు అంత నమ్మకంగా ఉన్నాడో నాకు తెలుసు. సౌండ్‌ ఒక ఆయుధం అని ఒక రకమైన కొత్త యాంగిల్‌ని సినిమాలో చూపించారు.

థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన సినిమా ఇది. అందరూ థియేటర్స్‌లో చూసి ఆదికి, ‘శబ్దం’ టీమ్‌కి మంచి బ్లాక్‌ బస్టర్‌ ఇవ్వాలి’’ అన్నారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘శబ్దం’ ప్రయాణం 16 ఏళ్ల క్రితం మొదలైంది. ‘వైశాలి’ లేకపోతే ‘శబ్దం’ ఉండేది కాదు. మా డైరెక్టర్‌ అరివళగన్‌కి ధన్యవాదాలు. హారర్‌ ఫ్యాన్స్‌కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది’’ అని చెప్పారు. అరివళగన్‌ మాట్లాడుతూ– ‘‘వైశాలి’ తర్వాత ఆది, నేను మళ్లీ సినిమా చేయాలనుకున్నప్పుడు సౌండ్‌ని హారర్‌ థీమ్‌గా తీసుకోవాలనుకున్నాం. సౌండ్‌ని విజువలైజ్‌ చేసి, హారర్‌ క్రియేట్‌ చేయడం సవాల్‌గా అనిపించింది. తమన్‌ పది రెట్లు ఎక్కువ ఇంపాక్ట్‌ ఉన్న సంగీతం ఇచ్చారు’’ అన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)